ఛీ.. ఆ డైరెక్టర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు: ప్రముఖ నటి

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటి స్నేహా జైన్ తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించింది. ఇటీవల ఆ నటి ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. కెరీర్ స్టార్టింగ్ లోనే తాను క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నానని, ప్రముఖ డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ప్రముఖ డైరెక్టర్ తనకు ఫోన్ చేసి సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పాడని.. కానీ, అతనితో హైదరాబాద్ లో […]

Update: 2021-10-02 07:49 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటి స్నేహా జైన్ తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించింది. ఇటీవల ఆ నటి ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. కెరీర్ స్టార్టింగ్ లోనే తాను క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నానని, ప్రముఖ డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది.

ప్రముఖ డైరెక్టర్ తనకు ఫోన్ చేసి సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పాడని.. కానీ, అతనితో హైదరాబాద్ లో ఒకరోజంతా గడపాలన్నాడని.. దీంతో తాను ఒక్కసారిగా షాక్ కు గురయ్యానని.. ఆ తర్వాత వెంటనే తాను ఫోన్ పెట్టేశానని ఆ నటి ఆ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. మళ్లీ అదే డైరెక్టర్ వారం రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి… అలాగే అసభ్యంగా మాట్లాడటంతో ఆమెకు కోపం వచ్చి గట్టిగా అరిచి ఫోన్ పెట్టేశానని స్నేహా అందులో తెలియజేసింది.

Tags:    

Similar News