Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ బెనిఫిట్స్.. డయాబెటిస్ ఉన్నవారు తినొచ్చా?

Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ బెనిఫిట్స్.. డయాబెటిస్ ఉన్నవారు తినొచ్చా?

Update: 2024-11-26 14:56 GMT

దిశ, ఫీచర్స్ : వివిధ ఆహారాలు, పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా.. షుగర్ పేషెంట్స్ ఏవి తినాలి?, ఏవి తినకూడదు? అనే సందేహాలు పలువురిని వెంటాడుతుంటాయి. అలాంటి వాటిలో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి. తియ్యగా ఉండే ఈ పండును తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయేమోనని కొందరు భావిస్తుంటారు. కానీ అలాంటి అపోహ అవసరం లేదని, రోజుకు వంద గ్రాముల వరకు తినవచ్చునని పోషకాహార నిపుణులు అంటున్నారు. పైగా దీనివల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

డ్రాగన్ ఫ్రూట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీ న్యూట్రియంట్స్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. పైగా ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. కాబట్టి తగిన మోతాదులో రెగ్యులర్‌గా తీసుకున్నా డయాబెటిస్ ఉన్నవారికి ప్రాబ్లం ఉండదు. పైగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాకపోతే రోజులో వంద గ్రాములకంటే ఎక్కువగా తినకపోవడం మంచిది. ఎందుకంటే వంద గ్రాముల్లో సమారు 60 కేలరీలు ఉంటాయి. ఈ మోతాదు షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

ఫైబర్ కంటెంట్ మూలంగా డ్రాగన్ ఫ్రూట్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరుస్తుంది. గ్లూకోజ్ శోషణను నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం మెండుగా ఉండటంవల్ల బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్ చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మధుమేహం ఉన్నవారికి గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తాయి. అధిక బరువు సమస్యను, జీర్ణక్రియ సమస్యలను నివారిస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా డైలీ 100 గ్రాముల వరకు డ్రాగన్ ఫ్రూట్‌ను తినవచ్చు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Read More...

Cardamom: రోజూ ఇలాచీ తింటే ఆ అనారోగ్య సమస్యలన్నింటికీ సులభంగా చెక్ పెట్టొచ్చు!


Tags:    

Similar News