టీటీడీకి 300 కోట్లు లాస్

కరోనా కష్టాలు తిరుమల వెంకన్నను కూడా వీడలేదు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో గత నెల రోజులుగా శ్రీవారి దర్శనాలు నిలిచిపోయాయి. గతంలో ముందుగా రిజర్వ్ చేసుకున్న టికెట్లను టీటీడీ క్యాన్సిల్ చేసింది. దీంతో శ్రీవారి ఆదాయానికి భారీగా గండిపడింది. నెల రోజుల పాటు దేవాలయానికి భక్తుల రాకపోకలు నిలిచిపోవడంతో సుమారు 300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లి ఉంటుందని టీటీడీ ఫైనాన్స్ విభాగం […]

Update: 2020-04-23 02:27 GMT

కరోనా కష్టాలు తిరుమల వెంకన్నను కూడా వీడలేదు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో గత నెల రోజులుగా శ్రీవారి దర్శనాలు నిలిచిపోయాయి. గతంలో ముందుగా రిజర్వ్ చేసుకున్న టికెట్లను టీటీడీ క్యాన్సిల్ చేసింది. దీంతో శ్రీవారి ఆదాయానికి భారీగా గండిపడింది.

నెల రోజుల పాటు దేవాలయానికి భక్తుల రాకపోకలు నిలిచిపోవడంతో సుమారు 300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లి ఉంటుందని టీటీడీ ఫైనాన్స్ విభాగం ఆందోళన చెందుతోంది. దర్శనాలు నిలిపేసినా శ్రీవారి కైంకర్యాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా టీటీడీ చర్యలు తీసుకుంది.

టీటీడీకి వివిధ ఆర్జితసేవా టిక్కెట్లు, ప్రసాదాలు, వసతి గదుల కేటాయింపు ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుంది. అలాగే తలనీలాలు, దుకాణాలు, హోటళ్ల ద్వారా వచ్చే బాడుగలు, ప్రధాన ఆదాయమార్గమైన శ్రీవారి హుండీ ఆదాయం కూడా నిలిచిపోయింది. దీంతో సుమారు 300 కోట్ల రూపాయల ఆదాయం నిలిచిపోయింది.

మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్న నేపథ్యంలో చివరి త్రైమాసిక ఆదాయం లెక్కలు తల్లకిందులవుతాయని టీటీడీ భావిస్తోంది. కరోనా కేసులు తగ్గితే లాక్‌డౌన్ ముగుస్తుంది. లేని పక్షంలో దానిని పొడించే ప్రమాదం ఉంది. ఇదింకా కొనసాగితే 500 కోట్ల వరకు లాస్ వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

Tags: tirumala tirupati devastanam, tirupati, tirumala, ttd, income, venkanna

Tags:    

Similar News