ఎస్వోలను నియమించాలని విజ్ఞప్తి

దిశ, న్యూస్​బ్యూరో: సమగ్ర శిక్ష ప్రాజెక్టులో ఎంపికైన ఎస్​పీడీ, ఏఎస్​పీడీ అభ్యర్థులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ విద్యాశాఖ కమిషనర్​కు, ప్రాజెక్టు డైరెక్టర్​కు టీఎస్​యూటీఎఫ్​, టీపీటీఎఫ్​ బుధవారం లేఖ రాశాయి. గతేడాది నవంబర్​ 27న నిర్వహించిన పరీక్షలో ఎంపికైనవారిని ఫిబ్రవరిలో మెరిట్ జాబితాను ప్రకటించారని, అయినా ఇప్పటికీ వారిని ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టలేదని ఫెడరేషన్లు గుర్తు చేశారు. ప్రస్తుతమున్న ఎస్​ఓల ఉద్యోగ కాలం ముగిసి రెండు నెలలు కావస్తున్నా వారినే కొనసాగిస్తున్నారని తెలిపాయి. ఇది నిబంధనలకు విరుద్ధమని, […]

Update: 2020-08-05 09:59 GMT

దిశ, న్యూస్​బ్యూరో: సమగ్ర శిక్ష ప్రాజెక్టులో ఎంపికైన ఎస్​పీడీ, ఏఎస్​పీడీ అభ్యర్థులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ విద్యాశాఖ కమిషనర్​కు, ప్రాజెక్టు డైరెక్టర్​కు టీఎస్​యూటీఎఫ్​, టీపీటీఎఫ్​ బుధవారం లేఖ రాశాయి. గతేడాది నవంబర్​ 27న నిర్వహించిన పరీక్షలో ఎంపికైనవారిని ఫిబ్రవరిలో మెరిట్ జాబితాను ప్రకటించారని, అయినా ఇప్పటికీ వారిని ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టలేదని ఫెడరేషన్లు గుర్తు చేశారు. ప్రస్తుతమున్న ఎస్​ఓల ఉద్యోగ కాలం ముగిసి రెండు నెలలు కావస్తున్నా వారినే కొనసాగిస్తున్నారని తెలిపాయి. ఇది నిబంధనలకు విరుద్ధమని, ఎంపికైన వారిని వెంటనే ఉద్యోగాల్లో తీసుకోవాలని కోరాయి.

Tags:    

Similar News