విద్యుత్ బిల్లు చెల్లింపునకు ప్రత్యేక యాప్
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరూ ఆన్‌లైన్‌లోనే ఈ నెల విద్యుత్ బిల్లులు చెల్లించాలని రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్‌ఎస్పీడీసీఎల్ కోరింది. ఇందు కోసం తమ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి టీఎస్‌ఎస్పీడీసీఎల్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత వినియోగదారులు తమ విద్యుత్ కనెక్షన్ యూనిక్ సర్వీసు నెంబర్‌ను ఎంటర్ చేయాలని, అనంతరం అందులో వచ్చే విద్యుత్ బిల్లు మొత్తాన్ని అక్కడున్న పేమెంట్ […]
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరూ ఆన్‌లైన్‌లోనే ఈ నెల విద్యుత్ బిల్లులు చెల్లించాలని రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్‌ఎస్పీడీసీఎల్ కోరింది. ఇందు కోసం తమ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి టీఎస్‌ఎస్పీడీసీఎల్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత వినియోగదారులు తమ విద్యుత్ కనెక్షన్ యూనిక్ సర్వీసు నెంబర్‌ను ఎంటర్ చేయాలని, అనంతరం అందులో వచ్చే విద్యుత్ బిల్లు మొత్తాన్ని అక్కడున్న పేమెంట్ వాలెట్‌లలో ఏదో ఒకదాని ద్వారా చెల్లించవచ్చని సికింద్రాబాద్ ఎస్ఈ మాధవరెడ్డి తెలిపారు.
Tags: tsspdcl, app, power bill payment