CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఫారిన్ టూర్‌కు ఏసీబీ కోర్టు అనుమతి

సీఎం రేవంత్ ఫారిన్ టూర్‌కు ఏసీబీ కోర్టు అనుమతి

Update: 2025-01-09 10:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఈనెల 13 నుంచి 23వ తేదీ వరకు బ్రిస్బేన్, దావోస్ పర్యటనకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. జూలై 6వ తేదీ లోపు తిరిగి పాస్ పోర్టును అప్పగించాలని ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో బెయిల్ కోసం రేవంత్‌రెడ్డి తన పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించారు. విదేశాలకు వెళ్లే (CM Foreign Tour) ప్రతిసారి కోర్టు నుంచి తన పాస్‌పోర్టును తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రాబోయే విదేశీ పర్యటనల నేపథ్యంలో పాస్‌పోర్టు కోసం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉందని, ఆరు నెలల పాటు పాస్‌పోర్టు ఇవ్వాలని సీఎం అభ్యర్థించారు. ముఖ్యమంత్రి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు (ACB Court).. ఇవాళ పాస్‌పోర్టు ఇచ్చేందుకు అంగీకరించింది.

Tags:    

Similar News