CM Revanth Reddy : రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రేపు జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం(Collectors Meeting) నిర్వహించనున్నారు.

Update: 2025-01-09 11:36 GMT

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రేపు జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం(Collectors Meeting) నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో సీఎం అన్ని జిల్లాల కలెక్టర్లతో మీటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. కాగా త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections) నేపథ్యంలో.. ప్రజల్లోకి ప్రభుత్వ పథకాల గురించి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పలు కార్యక్రమాలు చేపట్టాలని ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ క్రమంలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాల మీద రేపు సీఎం కలెక్టర్లతో చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించేందుకు కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించిందని తెలుస్తోంది. ఇటు పార్టీ నాయకులకు, అటు అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సహ ముఖ్య నేతలంతా బిజీ బిజీగా సమీక్షల్లో, పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.  

Tags:    

Similar News