నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. TSLPRB నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్..
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్- TSLPRB శుభవార్త చెప్పింది. దీని పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి ఓ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే, బుధవారం నుంచి దరఖాస్తు దారులను ఆహ్వానిస్తోంది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్- TSLPRB తాజాగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలుస్తుండగా.. ఇందులో […]
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్- TSLPRB శుభవార్త చెప్పింది. దీని పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి ఓ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే, బుధవారం నుంచి దరఖాస్తు దారులను ఆహ్వానిస్తోంది.
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్- TSLPRB తాజాగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలుస్తుండగా.. ఇందులో మొత్తం 151 ఖాళీలు ఉన్నట్టు సమాచారం.
తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు కోసం 2021 ఆగస్ట్ 29 చివరి తేదీగా నిర్ణయించారు. దీనికి సంబంధించిన వివరాల కోసం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్- TSLPRB అధికారిక వెబ్‌సైట్ https://www.tslprb.in/లో చూడవచ్చును.
అయితే, దరఖాస్తు దారులు ముందుగా నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి. విద్యార్హతలు సరిచూసుకుని ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. మ్యాన్యువల్ అప్లికేషన్ అనుమతించరు. అంతేకాకుండా అభ్యర్థులు ఒకసారి మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు చేస్తే దరఖాస్తులన్నీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. అందుకోసమే అభ్యర్థులు అప్లికేషన్ను క్షణ్ణంగా చదివి చేయాలి.
క్వాలిఫికేషన్ విషయానికొస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా పాస్ అవ్వాలి. LLB, BL పాస్ అయిన వారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ళ లా కోర్సు పాస్ అయినవారు కూడా అప్లై చేసుకోవచ్చును.
క్యాండిడేట్స్ వయస్సు విషయానికొస్తే 2021 జూలై 1 నాటికి 34 ఏళ్ల వయస్సు మించరాదు. క్రిమినల్ కోర్టుల్లో అడ్వకేట్‌గా కనీసం మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1,500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 750. పే స్కేల్ వివరాలు రూ.54,220 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,33,630 వేతనం వస్తుంది.
ప్రాసిక్యూషన్ డిపార్ట్ మెంట్ పోస్టుల దరఖాస్తుకు అభ్యర్థులు ముందుగా https://www.tslprb.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లింక్ పైన క్లిక్ చేయాలి. అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. అంతేకాకుండా ఫోటో మరియు సంతకాన్ని కూడా అప్‌లోడ్ చేయాలి.
SSC సర్టిఫికెట్‌తో పాటు విద్యార్హతల సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. వీటితో పాటు అడ్వకేట్‌గా తెలంగాణ బార్ కౌన్సిల్ లేదా ఇతర రాష్ట్రాల బార్ కౌన్సిల్ జారీ చేసిన సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. మూడేళ్లుగా క్రిమినల్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఉన్న సర్టిఫికెట్ కూడా అప్‌లోడ్ చేయాలి.
ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదివిన స్టడీ, బోనఫైడ్ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రాలు, ఇతర సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత ఫీజు చెల్లించి, దరఖాస్తు పత్రాన్ని సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ పూర్తయ్యాక ఫామ్ ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి.