Agnivir Vayu Recruitment: ఇంటర్ అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

కేంద్ర ప్రభుత్వ(Central Govt) రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీం(Agnipath Scheme)లో భాగంగా ఎయిర్ ఫోర్స్(Air Force)లో నియామకాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

Update: 2024-12-23 04:14 GMT

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ(Central Govt) రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీం(Agnipath Scheme)లో భాగంగా ఎయిర్ ఫోర్స్(Air Force)లో నియామకాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అగ్నివీర్ వాయు(Agnivir Vayu) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://agnipathvayu.cdac.in/AV/ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 7 నుంచి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 27 జనవరి 2025. మార్చిలో ఎగ్జామ్ నిర్వహించి నవంబర్ లో తుది ఫలితాలను ప్రకటిస్తారు. 

పోస్టులు:

అగ్నివీర్ వాయు

విద్యార్హత:

కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్/ తత్సమాన విద్య పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వయోపరిమితి:

1-1-2005 నుంచి 1-07-2008 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు రుసుము:

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు రూ. 500 ఫీజు చెల్లించాలి.

Tags:    

Similar News