Sainik School: టీచర్ ఉద్యోగాలకు సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రం అన్నమయ్య(Annamayya) జిల్లా కలికిరి(Kalikiri)లోని సైనిక్ స్కూల్(Sainik School) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2024-12-22 13:10 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రం అన్నమయ్య(Annamayya) జిల్లా కలికిరి(Kalikiri)లోని సైనిక్ స్కూల్(Sainik School) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 7 టీచర్(Teacher) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://sskal.ac.in/ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10 జనవరి 2025.

పోస్టులు, ఖాళీలు:

టీచర్ - 07

విద్యార్హత:

పోస్టును అనుసరించి సంబధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, బీఏ, బీఎడ్, ఎంఏ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్, ఉద్యోగానుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

విద్యార్హతలు, రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.

వయోపరిమితి:

21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము:

జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ. 500 ఫీజు చెల్లించాలి. మిగతా కేటగిరీ వారికి రూ.250 ఫీజు ఉంటుంది.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 38,252 నుంచి రూ. 73,491 వరకు జీతం ఉంటుంది.

Tags:    

Similar News