అమ్మకానికి.. ట్రంప్ విమానం

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ట్రంప్ ఓ సాధారణ అమెరికా పౌరుడిగా మారబోతున్నారు. కానీ విలాసాల విషయానికొస్తే ట్రంప్ ఏమాత్రం తగ్గడు. ఎక్కడికైనా వెళ్లాలంటే.. ఎక్కువగా తన ప్రైవేట్ జెట్స్, హెలికాప్టర్స్ వాడుతుంటాడు. అయితే తాజాగా ట్రంప్ తనదగ్గరున్న ఓ హెలికాప్టర్‌ను అమ్మకానికి పెట్టాడు. ప్రస్తుతం ట్రంప్ దగ్గర బోయింగ్ 757 విమానంతో పాటు సెస్నా సిటేషన్ ఎక్స్‌, మూడు సికోర్‌స్కై ఎస్ 76-బీ హెలికాప్టర్‌లు ఉన్నాయి. ట్రంప్ […]

Update: 2020-11-09 01:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ట్రంప్ ఓ సాధారణ అమెరికా పౌరుడిగా మారబోతున్నారు. కానీ విలాసాల విషయానికొస్తే ట్రంప్ ఏమాత్రం తగ్గడు. ఎక్కడికైనా వెళ్లాలంటే.. ఎక్కువగా తన ప్రైవేట్ జెట్స్, హెలికాప్టర్స్ వాడుతుంటాడు. అయితే తాజాగా ట్రంప్ తనదగ్గరున్న ఓ హెలికాప్టర్‌ను అమ్మకానికి పెట్టాడు.

ప్రస్తుతం ట్రంప్ దగ్గర బోయింగ్ 757 విమానంతో పాటు సెస్నా సిటేషన్ ఎక్స్‌, మూడు సికోర్‌స్కై ఎస్ 76-బీ హెలికాప్టర్‌లు ఉన్నాయి. ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం తరచుగా బోయింగ్ 757 విమానాన్నే ఉపయోగించాడు. కాగా, సికోర్‌స్కై ఎస్ 76-బీ హెలికాప్టర్లలో ఒకదానిని ట్రంప్ ఇప్పుడు అమ్మకానికి పెట్టాడు. 1997నాటి సికోర్ స్కై 76-బీ విలువ 1.6 మిలియన్ డాలర్లు( రూ. 11కోట్లు) కాగా, 2008 సికోర్ స్కై మోడల్‌కు 3.3 మిలియన్లు (రూ. 24 కోట్లు)ధర ఉంటుందని ఓ వెబ్‌సైట్ పేర్కొంది. అయితే ‘గ్లోబలైర్.కామ్’ ప్రకారం సికోర్‌స్కై ఎస్ 76-బీ ధర 1.395 మిలియన్లు (రూ. 10 కోట్లు) ఉంటుందని అంచనా వేసింది. ఇప్పటి వరకు ఇది సుమారు 6,259 గంటల విమాన ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఇందులో ఆరుగురు కూర్చునే ఎగ్జిక్యూటివ్ క్యాబిన్‌తో పాటు సౌండ్ ప్రూఫింగ్ సిస్టమ్, మంచి ఇంటీరియర్, సెంట్రల్ జోన్ డ్రింక్స్ కేబినెట్‌, ఎయిర్ షో డిస్‌ప్లే వంటి సౌకర్యాలున్నాయి. 2016 ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ట్రంప్ ఈ హెలికాప్టర్ ఉపయోగించాడు.

Tags:    

Similar News