టీఆర్ఎస్ మహిళా నేతకు బిగ్ షాకిచ్చిన అధికారులు
దిశ,గోదావరిఖని : అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. ఏకంగా అధికార పార్టీ నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు. కొంతమంది నాయకులు ధర్నాలు రాస్తారోకోలు చేసినా అధికారులు అక్రమ కట్టడాలపై కన్నెర్ర చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే… ఎన్టీపీసీ టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తుముల పద్మకు సంబంధించిన అక్రమ కట్టడాలను అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ అధికారులు కూల్చివేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ టాస్క్ ఫోర్స్ అధికారులు గత రెండు రోజుల క్రితం ఎన్టీపీసీలో అక్రమ కట్టడాలపై కొరడా […]
దిశ,గోదావరిఖని : అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. ఏకంగా అధికార పార్టీ నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు. కొంతమంది నాయకులు ధర్నాలు రాస్తారోకోలు చేసినా అధికారులు అక్రమ కట్టడాలపై కన్నెర్ర చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే… ఎన్టీపీసీ టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తుముల పద్మకు సంబంధించిన అక్రమ కట్టడాలను అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ అధికారులు కూల్చివేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ టాస్క్ ఫోర్స్ అధికారులు గత రెండు రోజుల క్రితం ఎన్టీపీసీలో అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపిస్తున్న క్రమంలో కొంతమంది అధికార పార్టీ నాయకులు ధర్నాలు చేయడంతో టాస్క్ ఫోర్స్ అధికారులు మూడు రోజుల సమయాన్ని కేటాయించారు. అయినా కూడా వినక పోవడంతో అధికార పార్టీకి సంబంధించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అయితే కూల్చివేసిన అక్రమ కట్టడాలకు సంబంధించిన వారిలో తుముల పద్మ టీఆర్ఎస్ పార్టీ ఎన్టీపీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు ఉన్నారు. సదరు మహిళా సంఘం నాయకురాలు ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరులు అయినా అధికారులు కొరడా ఝుళిపించారు.