స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. గత వారం రోజులుగా ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ చర్చించారు. ఆయా జిల్లాల్లోని పరిస్థితులను బట్టి పలువురు సిట్టింగ్‌లకు ఉద్వాసన పలుకగా, మరికొందరికి రెండోసారి అవకాశం కల్పించారు. ఈ రోజు రాత్రి బీ ఫారాలు ఇవ్వనున్నారు. సోమవారం నామినేషన్లు వేయనున్నారు. కార్తీక సోమవారం మంచిదని భావించిన అధిష్టానం నామినేషన్లు వేయాలని అభ్యర్థులను సూచించినట్లు […]

Update: 2021-11-21 09:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. గత వారం రోజులుగా ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ చర్చించారు. ఆయా జిల్లాల్లోని పరిస్థితులను బట్టి పలువురు సిట్టింగ్‌లకు ఉద్వాసన పలుకగా, మరికొందరికి రెండోసారి అవకాశం కల్పించారు. ఈ రోజు రాత్రి బీ ఫారాలు ఇవ్వనున్నారు. సోమవారం నామినేషన్లు వేయనున్నారు. కార్తీక సోమవారం మంచిదని భావించిన అధిష్టానం నామినేషన్లు వేయాలని అభ్యర్థులను సూచించినట్లు సమాచారం.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే…

దండె విఠల్ (ఆదిలాబాద్), కసిరెడ్డి నారాయణరెడ్డి, సాయి చందు (మహబూబ్ నగర్),
తాత మధు (ఖమ్మం), శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి (రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్), ఎంసీ కోటిరెడ్డి (నల్గొండ), డాక్టర్ మర్రి యాదవ రెడ్డి (మెదక్), ఎల్. రమణ, భాను ప్రసాద్ రావు (కరీంనగర్), ఆకుల లలిత (నిజామాబాద్) పేర్లను ఖరారు చేశారు.

Tags:    

Similar News