రేవంత్ ఎక్కడ ఉంటే అక్కడ సర్వనాశనమే- టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ చీటర్స్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్లిన సర్వనాశనమేనని అందుకు టీడీపీ పార్టీ నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీని కూడా నాశనం చేస్తున్నాడని సీనియర్ నేతలు పార్టీని […]

Update: 2021-09-21 04:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ చీటర్స్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్లిన సర్వనాశనమేనని అందుకు టీడీపీ పార్టీ నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీని కూడా నాశనం చేస్తున్నాడని సీనియర్ నేతలు పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.

అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ హైదరాబాద్ అని ఆ ఇమేజ్ ని దెబ్బతీసేందుకు రేవంత్ కుట్ర పన్నుతున్నారని, ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు డ్రగ్స్ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ నాయకత్వంలో వచ్చిన ఎమ్మెల్యేలు కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు రావాలని.. ఛాలెంజ్ అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా టెస్టులు చేయించుకుందామని సవాల్ చేశారు.

Tags:    

Similar News