Paul: క్రీస్తు మతం మార్చమని చెప్పలేదు.. తెలుగు ప్రజలకు కేఏ పాల్ ఆసక్తికర సందేశం
ఏసు క్రీస్తు(Jesus Christ) మతం మార్చమని చెప్పలేదని, కేవలం శాంతి(Preach Peace) ప్రకటించమని మాత్రమే చెప్పాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Praja Shanti Party President KA Paul) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: ఏసు క్రీస్తు(Jesus Christ) మతం మార్చమని చెప్పలేదని, కేవలం శాంతి(Preach Peace) ప్రకటించమని మాత్రమే చెప్పాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Praja Shanti Party President KA Paul) అన్నారు. క్రిస్మస్(Christmas) సందర్భంగా ట్విట్టర్ వేధికగా వీడియో విడుదల చేసిన ఆయన.. తెలుగు ప్రజలకు(Telugu people) క్రిస్మస్ శుభాకాంక్షలు(Merry Christmas) తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 2024 ఏళ్ల క్రితం ఏసు ప్రభువు దేవుడు మానవ రూపంలో భూమి మీదకి వచ్చి, 12 మందిని సర్వలోకాలకు వెళ్లి మతాన్ని ప్రకటించమని చెప్పలేదని, శాంతిని మాత్రమే ప్రకటించమని చెప్పాడని, ఒక మతం నుంచి ఇంకో మతంలోకి మార్చమని చెప్పలేదని వివరించాడు. కానీ ఈ రోజు ప్రపంచంలో శాంతి లేదని, ఎక్కడా చూసినా గొడవలేనని అన్నారు. 197 దేశాల్లో గొవడలే ఉన్నాయని, గొడవలతో కోట్ల మంది చనిపోయారని తెలిపారు. ఈ రాజకీయ నాయకులు, ప్రపంచ నేతలు సైతాన్ మనసుతో యుద్దాలు చేసి, లోకాన్ని సర్వనాశనం చేస్తున్నారని చెప్పారు. క్రిస్మస్ అంటే గిఫ్ట్‌లు ఇచ్చుకొని, తిని, తాగి పడుకోవడం కాదని ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలని పిలుపునిచ్చారు.