Christmas: శాంతి దూత సందేశం మనందరికీ ఆదర్శం.. క్రిస్‌మస్ వేళ సీఎం కీలక సందేశం
క్రిస్‌మస్ (Christmas) పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్టియన్ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: క్రిస్‌మస్ (Christmas) పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) క్రిస్టియన్ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. క్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి మార్గదర్శకమని తెలిపారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని, ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఇతరుల పట్ల ప్రేమ, సహనం, శాంతి, సేవాభావం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని శాంతి దూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. క్రిస్మస్ వేడుకలను రాష్ట్రమంతా ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.