దళితుల ఓట్లు టీఆర్ఎస్‌కే.. ఎవరు అడ్డువచ్చినా ఖబడ్దార్..!

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఎన్నికల కోసం కాదని, ప్రజా సంక్షేమం కోసమేనని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే హన్మంతు షిండేతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దళిత బంధు గురువారం నుంచి అమలులోకి రావడం హర్షణీయమని, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అన్నారు. దళితులను గతంలో ఓటు బ్యాంకుగానే […]

Update: 2021-08-05 07:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఎన్నికల కోసం కాదని, ప్రజా సంక్షేమం కోసమేనని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే హన్మంతు షిండేతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దళిత బంధు గురువారం నుంచి అమలులోకి రావడం హర్షణీయమని, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అన్నారు.

దళితులను గతంలో ఓటు బ్యాంకుగానే పాలించిన పార్టీలు పరిగణించేవని, కానీ తెలంగాణ ప్రభుత్వం వారి సంక్షేమం, సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. దళిత బంధును ఆలేరు నియోజకవర్గం వాసాలమర్రి నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందని, మా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 76కుటుంబాలకు రూ.7.6కోట్లు జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయని, మాట ఇస్తే తప్పని నేత సీఎం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ పట్టుదలతో కాళేశ్వరాన్ని పూర్తి చేసినట్టే దళిత బంధును జయప్రదం చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎన్ని పార్టీలు పాలించినా దళితుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని, వారిలో మార్పు తీసుకొచ్చేందుకే కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. దళిత బంధు పథకం అమలులో మహిళల పాత్ర కీలకమని చెప్పడం అభినందనీయమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి స్కీం ఉందా ? అని ప్రశ్నించారు. అంబేడ్కర్ ను ఎన్నికల్లో ఓడించిన చరిత్ర కాంగ్రెస్ ది అని, అలాంటి పార్టీకి దళితుల గురించి మాట్లాడే హక్కు ఉందా ? అని ప్రశ్నించారు.

ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ దళిత బంధు ఎన్నికల కోసం తెచ్చిన పథకం కాదని, ఏడాది క్రితమే అమలు చేయాల్సిన పథకం అన్నారు. ప్రతిపక్షాల తీరును చూసి దళితులు ఈ పథకం ఆగిపోతుందా అనే ఆందోళన చెందుతున్నారన్నారు. కేసీఆర్ పట్టుదల ముందు ప్రతిపక్షాల విమర్శలు నిలవవు అని, దళితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దళిత బంధుకు ఎవరు అడ్డువచ్చినా ఖబడ్దార్ అని హెచ్చరించారు. హుజురాబాద్‌లో దళితుల మద్దతు టీఆర్ఎస్‌కే అని, వేరే పార్టీల డిపాజిట్లు గల్లంతు అవుతాయన్నారు.

ఎమ్మెల్యే హన్మంతు షిండే మాట్లాడుతూ గత ఏడేళ్ల నుంచి కేసీఆర్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కి చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. దళిత బంధును విమర్శిస్తున్న వారు ఒక్కసారి పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లి రావాలి అని, సీఎం కేసీఆర్ గొప్పతనం తెలుస్తుందని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఓట్లను ఆకర్షించడానికి పథకాలు పెట్టదని, ప్రజల ఆర్థిక, సమగ్రాభివృద్ధికి పాటుపడుతుందన్నారు.

Tags:    

Similar News