కరోనా రూల్స్ ఏమయ్యాయ్..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రసిద్ద త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరంలో గురువారం మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుధీర్ మునిగంటి ఆయన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. గురువారం కాళేశ్వరానికి వచ్చిన ఈయన కోసం పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఆలయ కమటీ చైర్మన్ బొమ్మర వెంకటేశం, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవిందర్ సింగ్, ఆలయ ఈఓ మారుతితో పాటు ఆ ప్రాంత టీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో కాళేశ్వరాని వచ్చారు. జన్మదినం సందర్భంగా ఏకంగా […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రసిద్ద త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరంలో గురువారం మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుధీర్ మునిగంటి ఆయన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. గురువారం కాళేశ్వరానికి వచ్చిన ఈయన కోసం పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఆలయ కమటీ చైర్మన్ బొమ్మర వెంకటేశం, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవిందర్ సింగ్, ఆలయ ఈఓ మారుతితో పాటు ఆ ప్రాంత టీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో కాళేశ్వరాని వచ్చారు. జన్మదినం సందర్భంగా ఏకంగా ఆలయ గర్భాలయంలోనే ప్రత్యేక పూజలు జరిపించారు. కరోనా నిబంధనలు పక్కన బెట్టి మరీ, ఈ వేడుకలు నిర్వహించారు. అంతేగాకుండా మహారాష్ట్రాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు టీఆర్ఎస్ నేతలు అతి ప్రాధాన్యం కల్పించడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సామాన్యుడు వెలితే నిబంధనలు చూపెట్టే దేవాదాయ అధికారులు ప్రముఖుల విషయంలో మినహాయింపు ఇస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అసలింతకు పొరుగు రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేకు ఇక్కడి టీఆర్ఎస్ నాయకులు అంత ప్రాధాన్యం కల్పించడం ఎందుకు అని అనుకుంటున్నారు. విషయం తెలిసి మీడియా ప్రతినిధులు గర్భాలయంలో పూజలు చేస్తున్న వైనాన్ని చిత్రీకరించేందుకు వెలితే వారిని అడ్డుకోవడమే కాకుండా సీసీ ఫుటేజీ రీల్ అయ్యే మానిటర్‌ను కూడా క్లోజ్ చేశారు. ఏది ఏమైనా బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధులే ఇలా వ్యవహిరిస్తే సామాన్యులు ఎలా నిబంధనలు పాటిస్తారని జనం విమర్శలు చేస్తున్నారు.నిభందనలు పాటిస్తారో కూర్సిలో కూర్చున్న పెద్ద సార్లకే తెలియాలని ఇక్కడి జనం అంటున్నారు.