ఈసారి నాకు అవకాశం ఇవ్వండి..!

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు త‌న‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని సీనియ‌ర్ టీఆర్‌ఎస్ నేత, న్యాయవాది జహీర్ అలీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావును కోరారు. ఈ మేర‌కు ఆదివారం మంత్రి స్వ‌గృహంలో భేటీ అయ్యారు. అధిష్టానానికి తన పేరును సూచించాల‌ని జ‌హీర్ అలీ మాజీ మంత్రికి విన్న‌వించారు. తొలి, మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మాల్లో పాల్గొన్న‌ట్టు, ఖ‌మ్మంలో ఆనాటి ఉద్యమంలో […]

Update: 2020-11-08 06:24 GMT

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు త‌న‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని సీనియ‌ర్ టీఆర్‌ఎస్ నేత, న్యాయవాది జహీర్ అలీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావును కోరారు. ఈ మేర‌కు ఆదివారం మంత్రి స్వ‌గృహంలో భేటీ అయ్యారు. అధిష్టానానికి తన పేరును సూచించాల‌ని జ‌హీర్ అలీ మాజీ మంత్రికి విన్న‌వించారు.

తొలి, మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మాల్లో పాల్గొన్న‌ట్టు, ఖ‌మ్మంలో ఆనాటి ఉద్యమంలో నిర్మాతలుగా 15 మంది ఉండ‌గా, అందులో తాను ఒక‌రిన‌ని గుర్తు చేశారు. ఈసారి ఖమ్మం జిల్లా నుంచి తొలి ఉద్యమకారుల్లో ఒకరినైన తనకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. జ‌హీర్ విన్న‌పానికి మాజీ మంత్రి సానుకూలంగా స్పందించిన‌ట్టుగా సమచారం. అధిష్ఠానం దృష్టికి విష‌యాన్ని తీసుకెళ్తాన‌ని చెప్పిన‌ట్టుగా జ‌హీర్ అలీ విలేక‌రుల‌కు వెల్ల‌డించారు.

Tags:    

Similar News