స్క్రాప్‌ను కూడా వదలట్లేదు.. TRS నాయకుడే కీలక సూత్రధారి.?

దిశ, గోదావరిఖని : రామగుండం పాత మున్సిపల్ కార్యాలయంలో ఉన్న స్క్రాప్ చోరీకి గురి కావడం సంచలనంగా మారింది. అయితే ఇప్పటికే దీనిపై పలు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్క్రాప్ తరలింపులో స్థానికంగా ఉండే అధికార పార్టీ నాయకుడి హస్తం ఉన్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. సదరు నాయకుడు పాత మున్సిపల్ కార్యాలయంలో గదిని సైతం ఆక్రమించి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై గతంలోనే విచారణ కొనసాగినా.. అధికారుల అండదండలతో […]

Update: 2021-09-25 07:59 GMT

దిశ, గోదావరిఖని : రామగుండం పాత మున్సిపల్ కార్యాలయంలో ఉన్న స్క్రాప్ చోరీకి గురి కావడం సంచలనంగా మారింది. అయితే ఇప్పటికే దీనిపై పలు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్క్రాప్ తరలింపులో స్థానికంగా ఉండే అధికార పార్టీ నాయకుడి హస్తం ఉన్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. సదరు నాయకుడు పాత మున్సిపల్ కార్యాలయంలో గదిని సైతం ఆక్రమించి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

దీనిపై గతంలోనే విచారణ కొనసాగినా.. అధికారుల అండదండలతో విచారణను నీరుగార్చుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రామగుండం పాత మున్సిపల్ కార్యాలయంలో మాయమైన స్క్రాప్‌ను తీసుకు వెళ్తున్న దృశ్యాలు ‘దిశ’ కు చిక్కాయి. ఎన్టీపీసీకి చెందిన ఓ స్క్రాప్ నిర్వాహకుడికి, స్థానిక నాయకుడు వేలంపాటలో తీసుకున్నామని చెప్పి అప్పగించినట్లు ప్రచారం జరుగుతున్నది. దీనిపై పోలీసులు, ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News