టీఆర్ఎస్ కౌన్సిలర్ అరెస్ట్

దిశ, ఆదిలాబాద్ : ఆరోగ్య శాఖ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన టీఆర్‌ఎస్ కౌన్సిలర్‌ను శనివారం నిర్మల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలో సర్వే చేస్తున్న తమకు ఒక వర్గం నుంచి ఒత్తిళ్లు వస్టున్నాయని, బెదిరింపులు పెరుగుతున్నాయని ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన గంట వ్యవధిలోనే ఈ అరెస్ట్ చోటుచేసుకుంది. పట్టణంలోని బూతర్‌కమాన్‌కు చెందిన అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్ చోటా జహీర్ ఆ ప్రాంతంలో సర్వే చేస్తున్న […]

Update: 2020-04-04 05:05 GMT

దిశ, ఆదిలాబాద్ : ఆరోగ్య శాఖ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన టీఆర్‌ఎస్ కౌన్సిలర్‌ను శనివారం నిర్మల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలో సర్వే చేస్తున్న తమకు ఒక వర్గం నుంచి ఒత్తిళ్లు వస్టున్నాయని, బెదిరింపులు పెరుగుతున్నాయని ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన గంట వ్యవధిలోనే ఈ అరెస్ట్ చోటుచేసుకుంది. పట్టణంలోని బూతర్‌కమాన్‌కు చెందిన అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్ చోటా జహీర్ ఆ ప్రాంతంలో సర్వే చేస్తున్న ఆరోగ్య సిబ్బందిని అటకాయించాడని, వారిని బెదిరించడంతోపాటు భయభ్రాంతులకు గురి చేశాడని ఉద్యోగులు పొలీసులకు ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించాడన్న కారణంగా కౌన్సిలర్ జహీర్ పై కేసు నమోదైంది. వెంటనే ఆయనను అరెస్ట్ చేసినట్లు సీఐ జాన్ దివాకర్ తెలిపారు.

Tags: Nirmal,Medical staff,TRS Councilor,Arrest

Tags:    

Similar News