టీఆర్ఎస్ కౌన్సిలర్ గుండాయిజం.. కుటుంబంతో కలిసి అతడిపై..
దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేట పట్టణంలో అధికార పార్టీ కౌన్సిలర్ల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. కౌన్సిలర్‌గా గెలిచిన మరుక్షణం నుండి తమ హీరోయిజం.. రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వారిపై దృష్టి సారించి సమయం దొరికినప్పుడల్లా బెదిరించడం.. అడ్డమొస్తే దాడులకు పాల్పడటం లాంటివి చేస్తున్నారు. అయినా వారిపై చర్యలు తీసుకునే నాదుడే కరువయ్యారు. తాజాగా ఆదివారం రాత్రి సిద్దిపేట పట్టణంలో ఓ వార్డు కౌన్సిలర్ తనకు స్వయాన వరుసకు తమ్ముడయ్యే వ్యక్తిపై కుటుంబ సమేతంగా వచ్చి […]
దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేట పట్టణంలో అధికార పార్టీ కౌన్సిలర్ల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. కౌన్సిలర్‌గా గెలిచిన మరుక్షణం నుండి తమ హీరోయిజం.. రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వారిపై దృష్టి సారించి సమయం దొరికినప్పుడల్లా బెదిరించడం.. అడ్డమొస్తే దాడులకు పాల్పడటం లాంటివి చేస్తున్నారు. అయినా వారిపై చర్యలు తీసుకునే నాదుడే కరువయ్యారు. తాజాగా ఆదివారం రాత్రి సిద్దిపేట పట్టణంలో ఓ వార్డు కౌన్సిలర్ తనకు స్వయాన వరుసకు తమ్ముడయ్యే వ్యక్తిపై కుటుంబ సమేతంగా వచ్చి దాడికి పాల్పడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
టీఆర్ఎస్ కౌన్సిలర్ గుండాయిజం..
సిద్దిపేట పట్టణానికి చెందిన కౌన్సిలర్లు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సింది పోయి గుండాయిజానికి తెరలేపారన్న ఆరోపణలు గతంలోనూ వినిపించాయి. తాజాగా సిద్దిపేట పట్టణం 26వ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన కెమ్మసారం ప్రవీణ్ తనకు వరుసకు తమ్ముడయ్యే కెమ్మసారం శ్రావణ్ పై దాడి చేయడం ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. సిద్దిపేట పట్టణం 26 వ వార్డు సమీపంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా కౌన్సిలర్ తమ్ముడు కెమ్మసారం శ్రావణ్ తన స్నేహితులతో కలిసి సెల్ఫీ దిగుతుండగా అటుగా వెళ్తున్న కౌన్సిలర్ మీరంతా నా గురించే మాట్లాడుకుంటున్నారంటూ శ్రావణ్ ను దూషించడం మొదలుపెట్టాడు. తర్వాత కౌన్సిలర్ కట్టె తీసుకొచ్చి మరీ బాదాడు. కౌన్సిలర్ ఒక్కరే కాదు వారి కుటుంబ సభ్యులైన తండ్రి సైతం కట్టె తీసుకొచ్చి బాదగా .. కౌన్సిలర్ తల్లి, భార్య సైతం శ్రావణ్ ని ఇష్టమొచ్చనట్టు బూతులు తిట్టారు. తన అన్నను కొట్టొద్దని వెళ్లిన శ్రావణ్ తమ్ముడిని సైతం కొట్టారు. ఇద్దరి శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరలవుతుంది.
తనకు ప్రాణ హాని ఉంది ..
సిద్దిపేట పట్టణ 26 వ వార్డు కౌన్సిలర్ కెమ్మసారం ప్రవీణ్ జరిపిన దాడిలో గాయపడ్డ బాధితుడు కెమ్మసారం శ్రావణ్ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన సిద్దిపేట పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో తాను సైతం కౌన్సిలర్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేశానని చెప్పారు. అప్పటి నుండి తనపై కౌన్సిలర్ ప్రవీణ్ కక్ష్య పెట్టుకున్నాడు. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా తన దోస్తులతో కలిసి సెల్ఫీ దిగుతుండగా వచ్చి ఇష్టమొచ్చినట్టు కట్టెలతో నన్ను, నా తమ్మున్ని కొట్టారు. కౌన్సిలర్, కౌన్సిలర్ వాళ్ల నాన్న, భార్య, తల్లి అందరు కలిసి కొట్టారు. చాలా గాయాలయ్యాయి. నాకు కౌన్సిలర్ కుటుంబంతో ప్రాణ హానీ ఉంది. ఎప్పటికైనా వాళ్లు నన్ను చంపేందుకు చూస్తున్నారు. దయచేసి మంత్రి హరీశ్ రావు, సీపీ జోయల్ డేవిస్ ఈ విషయంపై స్పందించి సాయం చేయాలని కోరుతున్నా అంటూ మీడియాతో మాట్లాడారు. మరి ఈ విషయంలో సిద్దిపేట మంత్రి కౌన్సిలర్ వైపు నిల్చుంటాడో.. బాధిత వ్యక్తి న్యాయం చేస్తాడో చూడాలి. ఇలాంటి సంఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. దీనిపై మంత్రి హరీశ్ రావు ఒక్కసారి కూడా స్పందించినట్టు కనపడలేదు. మరి ఈ విషయం లోనైన స్పందిస్తారా చూడాలి.