మధిర పట్టణాభివృద్ధికి టీఆర్ఎస్ కట్టుబడి ఉంది
దిశ, ఖమ్మం: మధిర మునిసిపాలిటీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు టీఆర్ఎస్ కట్టుబడి ఉందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ అన్నారు. మంగళవారం స్థానిక టీఆర్ఎస్ ఆఫీస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలకతీతంగా మధిర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం ఎంపీ నామానాగేశ్వర్‌రావు కృషితో మధిర రైల్వే అండర్ బ్రిడ్జి మంజూరు కావడంతో నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మునిసిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు ప్రయత్నం […]
దిశ, ఖమ్మం: మధిర మునిసిపాలిటీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు టీఆర్ఎస్ కట్టుబడి ఉందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ అన్నారు. మంగళవారం స్థానిక టీఆర్ఎస్ ఆఫీస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలకతీతంగా మధిర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం ఎంపీ నామానాగేశ్వర్‌రావు కృషితో మధిర రైల్వే అండర్ బ్రిడ్జి మంజూరు కావడంతో నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మునిసిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈనెల 20 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, దేవిశెట్టి రంగారావు జిల్లా నాయకులు మొండితోక జయకర్, మధిర సొసైటీ చైర్మన్ బిక్కి ప్రసాద్, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, భరత్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.