టీఆర్ఎస్, కాంగ్రెస్ మహిళా నాయకురాలు కుమ్మక్కు.. ఫారెస్ట్ భూమి కబ్జా
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని సింగరేణి ఏరియా పీ.వీ కాలనీ డీ-కోటర్స్ పరిధిలో ఉన్న ఫారెస్ట్ భూమిని కబ్జా చేశారనే ఆరోపణలు స్థానిక ప్రజల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి. పీ.వీ కాలనీ డీ-కోటర్స్ ప్రక్కన ఉన్న ఫారెస్ట్ భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళ నాయకురాలు కబ్జా చేసిన వారిలో ఉండటం […]
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని సింగరేణి ఏరియా పీ.వీ కాలనీ డీ-కోటర్స్ పరిధిలో ఉన్న ఫారెస్ట్ భూమిని కబ్జా చేశారనే ఆరోపణలు స్థానిక ప్రజల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి. పీ.వీ కాలనీ డీ-కోటర్స్ ప్రక్కన ఉన్న ఫారెస్ట్ భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళ నాయకురాలు కబ్జా చేసిన వారిలో ఉండటం గమనార్హం. కబ్జా చేసిన ఫారెస్ట్ భూమిని ప్లాట్లుగా మార్చి కొన్ని లక్షల రూపాయలకు అమ్ముకున్నారని స్థానికుల ద్వారా తేటతెల్లమవుతోంది.
సింగరేణి ఉద్యోగులు పదవి విరమణ పొందిన తర్వాత ఎక్కడ ఇల్లు నిర్మించుకోవాలని కుటుంబ సభ్యులతో ఆలోచన చేస్తారు. కానీ ఈ ఆలోచనను ఈ ఇద్దరు టీఆర్ఎస్ వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళ నాయకురాలు ఆసరాగా చేసుకుని ఫారెస్ట్ భూమిని కబ్జా చేసి సింగరేణి పదవి విరమణ పొందిన వ్యక్తులకు
ప్లాట్లుగా మార్చి లక్షల్లో విక్రయించారని తెలుస్తుంది. ఫారెస్ట్ భూమిని కబ్జా చేసి ఇల్లులు నిర్మించుకొని ఉంటే ఫారెస్ట్ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనేది మణుగూరు మండలవ్యాప్తంగా సంచాలనాత్మకంగా మారింది. మరి ఎందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవడంలేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులే మౌనంగా ఉన్నారంటే ఆ భూమి మీద ఎంత వాటా తీసుకున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఫారెస్ట్ భూమిని కాపాడాల్సిన ఫారెస్ట్ అధికారులే భూకబ్జాదారులకు సపోర్ట్ చేస్తే ఫారెస్ట్ భూమిని కాపాడేది ఎవరని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా ఫారెస్ట్ భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి గంజాయి సేవించడానికి అడ్డాగా మారుస్తున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
వైఎస్సార్ కాలనీలో ఫారెస్ట్ భూములపై ఇంత దందా జరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనేది పీవీ కాలనీలో చర్చనీయాంశంగా మారింది. ఫారెస్ట్, సింగరేణి అధికారుల కనుసన్నల్లోనే ఈదందా జరిగిందనే విషయాలు మండలంలో వినిపిస్తున్నాయి. ఫారెస్ట్ భూముని పోడు చేసి అక్రమంగా ఇళ్లను నిర్మించారని పలువురు మేధావులు తెలుపుతున్నారు. సింగరేణి సంస్థలో ఇద్దరు కీలక వ్యక్తులకు దీనితో సంబంధం ఉందని కొంతమంది కార్మికులు గుసగుసలాడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు సింగరేణి అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు, తదితర అధికారులకు చెప్పినా ఏమాత్రం పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అధికారులు పట్టించుకోకపోవడానికి గల కారణాలు ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు .ఏది ఏమైనా వైఎస్సార్ కాలనీ పేరుతో భారీ కుంభకోణం జరిగిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మరి ఇప్పటికైనా వెంటనే వైఎస్సార్ కాలనీపై దర్యాప్తు చేపట్టి ఫారెస్ట్ భూమిని కాపాడాలని, కబ్జా చేసి లక్షల రూపాయలకు అమ్మినవారిపై చట్టపరమైన కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు,పలువురు నాయకులు కోరుతున్నారు.