బలగాల ఉపసంహరణకే చైనా మొగ్గు

న్యూఢిల్లీ: బలగాల ఉపసంహరణ వేగంగా జరిపేందుకు పై ఇరుదేశాలు అంగీకరించాయని భారత్ ప్రకటించిన తర్వాత రోజుల వ్యవధిలో చైనా స్పందించింది. సరిహద్దులో చాలా ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయిందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌వెన్ బిన్ గ్లోబల్ టైమ్స్ పత్రికకు తెలిపారు. మిలిటరీ, దౌత్య మార్గాల్లో చర్చల అనంతరం, సరిహద్దులో ఉద్రిక్తతలు సమసిపోయి, పూర్తి ఉపసంహరణవైపుగా పరిస్థితులు చేరుతున్నాయని వివరించారు. అంతేకాదు, ఐదో రౌండ్ సమావేశాలకు సన్నద్ధమవుతున్నట్టు వెల్లడించారు. ఈ వారంలోనే ఐదో రౌండ్ […]

Update: 2020-07-28 11:58 GMT

న్యూఢిల్లీ: బలగాల ఉపసంహరణ వేగంగా జరిపేందుకు పై ఇరుదేశాలు అంగీకరించాయని భారత్ ప్రకటించిన తర్వాత రోజుల వ్యవధిలో చైనా స్పందించింది. సరిహద్దులో చాలా ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయిందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌వెన్ బిన్ గ్లోబల్ టైమ్స్ పత్రికకు తెలిపారు. మిలిటరీ, దౌత్య మార్గాల్లో చర్చల అనంతరం, సరిహద్దులో ఉద్రిక్తతలు సమసిపోయి, పూర్తి ఉపసంహరణవైపుగా పరిస్థితులు చేరుతున్నాయని వివరించారు. అంతేకాదు, ఐదో రౌండ్ సమావేశాలకు సన్నద్ధమవుతున్నట్టు వెల్లడించారు. ఈ వారంలోనే ఐదో రౌండ్ మిలిటరీ చర్చలు జరిగే అవకాశమున్నది.

యాప్‌లపై బ్యాన్ ఎత్తేసి.. తప్పు సరిదిద్దుకోవాలి..

చైనా యాప్‌లను భారత్ నిషేధించడంపై ఆ దేశం నిరసించింది. భారత్ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నదని ఆరోపించింది. యాప్‌లపై బ్యాన్ ఎత్తేసి తప్పులను సరిదిద్దుకోవాలని కోరింది. వీచాట్ సహా 59 యాప్‌లను గతనెల నిషేధించి చైనా కంపెనీల చట్టబద్ధ హక్కులను కాలారాసిందని, ఈ తప్పును సరిదిద్దుకోవాలని చైనీస్ ఎంబీస ప్రతినిధి కౌన్సిల్ జీ రోంగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాజాగా, ఆ 59 యాప్‌ల క్లోన్‌లుగా గుర్తించి టిక్‌టాక్ లైట్, షేర్ఇట్ లైట్, హెలో లైట్ సహా 47 యాప్‌లను నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News