భారత మార్కెట్లోకి కొత్త బైక్‌ను విడుదల చేసిన ట్రయంఫ్!

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ దేశీయ మార్కెట్లో తన కొత్త గోల్డ్‌లైన్, స్పెషల్ ఎడిషన్ వేరియంట్ బైకులను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న 18 మోటార్‌సైకిళ్ల పోర్ట్‌ఫోలియోకు అదనంగా తొమ్మిది వేరియంట్లను జత చేస్తున్నట్టు మంగళవారం కంపెనీ వెల్లడించింది. కొత్త ట్రయంఫ్ బోన్‌విల్ గోల్డ్‌విల్ ఎడిషన్‌లో 6 మోటార్‌సైకిళ్లు, మూడు స్పెషల్ ఎడిషన్ బైకులు ఉంటాయని కంపెనీ తెలిపింది. స్పెషల్ ఎడిషన్ బైకులు కేవలం ఏడాది పాటు మాత్రమే అమ్మకానికి ఉంటాయని […]

Update: 2021-12-21 09:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ దేశీయ మార్కెట్లో తన కొత్త గోల్డ్‌లైన్, స్పెషల్ ఎడిషన్ వేరియంట్ బైకులను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న 18 మోటార్‌సైకిళ్ల పోర్ట్‌ఫోలియోకు అదనంగా తొమ్మిది వేరియంట్లను జత చేస్తున్నట్టు మంగళవారం కంపెనీ వెల్లడించింది. కొత్త ట్రయంఫ్ బోన్‌విల్ గోల్డ్‌విల్ ఎడిషన్‌లో 6 మోటార్‌సైకిళ్లు, మూడు స్పెషల్ ఎడిషన్ బైకులు ఉంటాయని కంపెనీ తెలిపింది. స్పెషల్ ఎడిషన్ బైకులు కేవలం ఏడాది పాటు మాత్రమే అమ్మకానికి ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. వీటిని భిన్నమైన రంగుల్లో అందిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. వీటిలో గోల్డెన్ ఎడిషన్ వేరియంట్ ధరలు రూ. 9.55 లక్షల నుంచి రూ. 12.75 లక్షల మధ్య నిర్ణయించింది. స్పెషల్ ఎడిషన్ కింద ప్రవేశపెట్టిన మోటార్‌సైకిళ్లలో రాకెట్ 3ఆర్ 221 ధరలు రూ. 20.8-21.4 లక్షల మధ్య ఉండగా, స్ట్రీట్ ట్విన్ ఈసీ 1 స్పెషల్ ఎడిషన్ బైక్ ధర రూ. 8.85 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ పేర్కొంది.

Tags:    

Similar News