Bank Strike: ఖాతాదారులకు బిగ్ అలర్ట్..2 రోజులు మూతపడనున్న బ్యాంకులు?

Bank Strike: బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంకులో ఏవైనా అత్యవసర పనులు ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి. ఎందుకంటే బ్యాంకులు రెండు రోజుల పాటు మూత పడే అవకాశం ఉంది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ బ్యాంకులు బంద్ (Bank Strike) పాటించే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు చూద్దాం.

Update: 2025-01-10 09:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ బ్యాంకులు సమ్మె (Bank Strike) బాట పట్టే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు బ్యాంకులు మూసివేస్తామని ఏఐబీఓసీ ( All India Bank Officers Confederation)తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు బంద్ పాటించే ఛాన్స్ ఉందని పీటీఐ వార్త సంస్థ పేర్కొంది.

వారానికి ఐదు రోజుల పనిదినాలు(Five-day workdays), అన్ని కేడర్లలో తగిన నియామకాలతో పాటు ఇతర డిమాండ్ల కోసం ఫిబ్రవరి 24,25వ తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె(Nationwide strike)కు పిలుపునిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ హెచ్చరికలు జారీ చేసింది.

డిమాండ్లు ఇవే?

-బ్యాంకు ఉద్యోగులకు వారికి 5 రోజులు పనిదినాలు(Five-day workdays) కల్పించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. చాలా ఏళ్లుగా ఈ డిమాండ్ వినిపిస్తూనే ఉంది. కానీ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

-బ్యాంకులకు అన్ని కేడర్లలో నియామకాల(Appointments)ను చేపట్టాలి. ఉద్యోగ భద్రతను ముప్పుగా పరిగణించి.. ఉద్యోగుల్లో విభజనను కల్పించే పనితీరు సమీక్ష , పిఎల్ఐలపై డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Department of Financial Services)ఈ మధ్యే జారీ చేసిన ఆదేశాలను వెంటనే విత్ డ్రా చేసుకోవాలి.

-ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వర్క్ మెన్(Workmen), ఆఫీసర్ డైరెక్టర్ల పోస్టుల(Officer Director posts)ను భర్తీ చేయాలి. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ లో పెండింగ్ లో ఉన్న సమస్యల(Pending issues)ను పరిష్కరించుకోవాలని కోరింది.

బ్యాంకు సమ్మె ఎప్పుడు ?

విధానపరమైన విషయాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులను డీఎఫ్ఎస్(DFS) సూక్ష్మ నిర్వహణ చేయడం ఆయా బోర్డుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని యూనియన్ ఆరోపిస్తోంది. ఫిబ్రవరి 24,25 తేదీల్లో 2 రోజుల పాటు అంటే సోమవారం(Monday), మంగళవారాలు(Tuesday) దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని తమ కార్యవర్గం ప్రతిపాదించిందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫడరేషన్ ( All India Bank Officers Confederation)ఓ ప్రకటన లో వెల్లడించింది.

అవసరం అయితే మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తేల్చిచెప్పింది. ఈ నెలలోనే సమ్మె నోటీసు(Strike notice) అందిన వెంటనే ఆందోళన కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ బ్యాంకులు నిజంగా సమ్మెకు దిగితే ప్రైవేట్ బ్యాంకులు ఈ సమ్మెల్ పాల్గొంటాయా లేదా అనేది చూడాల్సిందే.

Tags:    

Similar News