Jio: జియో బంపర్ ఆఫర్..రూ. 175కే ఎంటర్‎టైన్ మెంట్ ప్లాన్.. ఫ్రీగా 12 ఓటీటీ యాప్స్

Jio: రిలయన్స్ జియో(Jio) నుంచి అద్భుతమైన ప్లాన్స్ అందుబాటులోకి వచ్చింది. దీనిలో పూర్తిగా ఎంటర్ టైన్ మెంట్ ఎక్స్ పీరియన్స్ అందించే చౌకైన ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ లో 12 ఓటీటీ(OTT) యాక్సెస్ కూడా ఉంటాయి. అంతేకాదు ఇంటర్నెట్ వినియోగం కోసం 10GB డేటాను ఇస్తోంది కంపెనీ.

Update: 2025-01-10 11:13 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మీరు ఫుల్ ఎంటర్‎టైన్‎మెంట్ కోసం బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్(Best prepaid plan) కోసం చూస్తున్నట్లయితే.. జియో(Jio) మీకోసం బెస్ట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ లో మీరు డేటాతోపాటు 12 ఓటీటీ యాప్స్(OTT Apps) కు ఫ్రీ యాక్సెస్ పొందుతారు. వీటిలో చాలా చవకైన ప్లాన్ రూ. 175. ఇది డేటా ప్యాక్. దీని వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఇందులో ఇంటర్నెట్ వినియోగం కోసం 10GB డేటాను అందిస్తోంది కంపెనీ. ఈ ప్లాన్ లో మీరు సోనీ లైవ్(Soney Live) , జీ5(ZEE5), జీ సినిమా (ZEE Cinema)తో పాటు మొత్తం 10 ఓటీటీ యాప్స్(OTT Apps) కు యాక్సెస్ పొందుతారు.

28 రోజుల వ్యాలిటీడీ(28 days validity)తో ఉన్న ఈ ప్లాన్ లో మీరు ప్రతిరోజూ 2GB వరకు డేటాను పొందుతారు. ఈ ప్లాన్ అన్ లిమిటెడ్ కాలింగ్(Unlimited calling) ప్రయోజనంతో వస్తుంది. మీరు ఇందులో సోనీ లైవ్, జీ5తో సహా 12 ఓటీటీ యాప్స్ ను ఫ్రీగా పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది.

దీనిలో రోజూ 2 జీబీ డేటా ఇస్తోంది. ఈ ప్లాన్ లో కంపెనీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hot Star) మొబైల్ కు 3 నెలల పాటు ఫ్రీ యాక్సెస్ అందిస్తోంది. ఈ ప్లాన్ ఫ్రీ కాలింగ్ ను కూడా అందిస్తుంది. కాలింగ్ ప్రయోజనంతో కూడిన ఈ ప్లాన్ లో కంపెనీ అమెజాన్ ప్రైమ్ లైట్(Amazon Prime Lite), జియో మూవీస్ (Jio Movies)కు కూడా ఫ్రీ యాక్సెస్ అందిస్తోంది. జియో ఈ బంపర్ రీఛార్జీ ప్యాక్(Recharge pack) చేసుకోవాలంటే మై జియో యాప్(My Jio App) లేదా జియో అధికారిక వెబ్ సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News