టిక్‌టాక్ నిషేదంపై ఎంపీ ఆగ్రహం.. నోట్ల రద్దుతో పోల్చుతూ

దిశ, వెబ్ డెస్క్: ఇప్పుడు దేశవ్యాప్తంగా టిక్ టాక్ గురించే చర్చ జరుగుతోంది. టిక్ టాక్‌తో పాటు 59 చైనా యాప్స్‌ను నిషేధించడంతో.. టిక్ టాక్ స్టార్లు ఇంకా షాక్‌లోనే ఉన్నారు. తమకు ఇబ్బంది కలిగినప్పటికీ.. దేశ భద్రత దృష్ట్యా మంచి నిర్ణయమే తీసుకున్నారని చాలా మంది యూజర్లు కేంద్ర నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మాత్రం తీవ్రంగా తప్పుబట్టారు. టిక్ టాప్‌ను నిషేధించినందుకు కేంద్రంపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. […]

Update: 2020-07-01 08:50 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇప్పుడు దేశవ్యాప్తంగా టిక్ టాక్ గురించే చర్చ జరుగుతోంది. టిక్ టాక్‌తో పాటు 59 చైనా యాప్స్‌ను నిషేధించడంతో.. టిక్ టాక్ స్టార్లు ఇంకా షాక్‌లోనే ఉన్నారు. తమకు ఇబ్బంది కలిగినప్పటికీ.. దేశ భద్రత దృష్ట్యా మంచి నిర్ణయమే తీసుకున్నారని చాలా మంది యూజర్లు కేంద్ర నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మాత్రం తీవ్రంగా తప్పుబట్టారు. టిక్ టాప్‌ను నిషేధించినందుకు కేంద్రంపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టిక్ టాక్ ఎంటర్‌టైన్మెంట్ యాప్ అని, దాన్ని నిషేధించడం హఠాత్తు పరిణామం అని విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దు లాగే ఇది కూడా అనాలోచిత నిర్ణయమని నుస్రత్ జహాన్ విరుచుకుపడ్డారు.

టిక్ టాక్ వినోదాత్మకమైన యాప్. ఇది హఠాత్ పరిణామం. నిషేధం వెనక ఉన్న వ్యూహమేంటి? నిరుద్యోగులుగా మారిన యువత పరిస్థితేంటి? గతంలో విధించిన పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు ఎంతో నష్టపో​యారు. ఇప్పడు టిక్‌టాక్‌ను నిషేధించటం వల్ల కూడా అంతే స్థాయిలో ప్రజలు నష్టపోతారు. జాతీయ భద్రతకు భంగం కలుగుతుందని నిషేధించారు. ఇందులో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? అని నుస్రత్ జహాన్ కేంద్రాన్ని ప్రశ్నించారు.

Tags:    

Similar News