ఐఐటీ, ఎన్ఐటీలకు గిరిజన విద్యార్థులు ఎంపిక

దిశ, దమ్మపేట: దేశవ్యాప్తంగా బుధవారం ప్రకటించిన ఐఐటీ, ఎన్ఐటీ ఫలితాల్లో దమ్మపేట గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు సత్తా చాటారు. భారతదేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో సీట్లు సాధించారు. విద్యార్థులు ఐఐటీలో సీట్లు సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ శ్యామ్ కుమార్, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థులు ఉదయ్ కుమార్‌కు ఐఐటీ జోద్పూర్, ప్రవీణ్ కుమార్‌కు ఐఐటీ ఇండోర్, సాయిరామ్‌కు ఐఐటీ […]

Update: 2021-10-27 08:55 GMT

దిశ, దమ్మపేట: దేశవ్యాప్తంగా బుధవారం ప్రకటించిన ఐఐటీ, ఎన్ఐటీ ఫలితాల్లో దమ్మపేట గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు సత్తా చాటారు. భారతదేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో సీట్లు సాధించారు. విద్యార్థులు ఐఐటీలో సీట్లు సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ శ్యామ్ కుమార్, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థులు ఉదయ్ కుమార్‌కు ఐఐటీ జోద్పూర్, ప్రవీణ్ కుమార్‌కు ఐఐటీ ఇండోర్, సాయిరామ్‌కు ఐఐటీ గాంధీనగర్, అరవింద్‌కు ఐఐటీ వారణాసి, నితిన్‌కు ఎన్ఐటీ శ్రీచర్, గిరి ప్రసాద్‌కు ఎన్ఐటీ చంద్రగిరి యూనివర్సిటీలలో సీట్లు సాధించినట్లు ఆయన తెలిపారు. వీరితోపాటు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న మరో ముగ్గురు విద్యార్థులు కూడా ఐఐటీ సీట్లు సాధించినట్లు తెలిపారు.

Tags:    

Similar News