ఆదివాసీ నేత ఆశలు గల్లంతు.. బెర్త్ కేటాయించని మోడీ
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : సోయం బాపురావు ఆదివాసీ తెగకు చెందిన ఎంపీ. ఆదిలాబాద్ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో తొలిసారిగా ఎంపీగా గెలిచిన ఆయనకు.. ఆదివాసి కోటాలో తాజాగా విస్తరించిన కేబినెట్‌లో స్థానం లభిస్తుందని అంతా భావించారు. కేబినెట్లో ఆయనకు బెర్తు ఖాయమని భావించగా.. ఆఖరి వరకు ఊరించి చివరికి ఉసూరుమనిపించింది. ప్రధాని మోడీ కేబినెట్లో ఆయనకు అవకాశం దక్కకపోవడంతో ఉమ్మడి జిల్లా బీజేపీ శ్రేణుల్లో నిరాశ మిగిలింది. 2019 పార్లమెంట్ […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : సోయం బాపురావు ఆదివాసీ తెగకు చెందిన ఎంపీ. ఆదిలాబాద్ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో తొలిసారిగా ఎంపీగా గెలిచిన ఆయనకు.. ఆదివాసి కోటాలో తాజాగా విస్తరించిన కేబినెట్‌లో స్థానం లభిస్తుందని అంతా భావించారు. కేబినెట్లో ఆయనకు బెర్తు ఖాయమని భావించగా.. ఆఖరి వరకు ఊరించి చివరికి ఉసూరుమనిపించింది. ప్రధాని మోడీ కేబినెట్లో ఆయనకు అవకాశం దక్కకపోవడంతో ఉమ్మడి జిల్లా బీజేపీ శ్రేణుల్లో నిరాశ మిగిలింది.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన సోయం బాపురావుకు కేంద్ర కేబినెట్‌లో స్థానం దక్కలేదు. బోథ్ నియోజకవర్గానికి చెందిన ఆయన ఆదివాసీ తెగకు నాయకత్వం వహిస్తున్నారు. ఇక తుడుం దెబ్బ అధ్యక్షుడిగా పని చేస్తున్న ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు.
2004లో బోథ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లారు. టీఆర్ఎస్ పార్టీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు ఆయన కాంగ్రెస్‌కు వెళ్లిపోయారు. 2009లో కాంగ్రెస్ నుంచి బోథ్ నుంచి మరోసారి పోటీ చేయగా ఓడిపోయారు. 2018లో కాంగ్రెస్ నుంచి బోథ్ నియోజకవర్గంలో పోటీ చేయగా.. వరుసగా మూడోసారి కూడా ఓడిపోయారు. 2019లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరగా.. లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఆదివాసీల హక్కుల కోసం ఆయన నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఆదివాసీ తెగకు చెందిన ఎంపీగా ఉన్న ఆయన.. తుడుం దెబ్బ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీకి ఆయన పెద్దదిక్కుగా ఉన్నారు. ఆదివాసీల కోటాలో ఈసారి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందని అంతా భావించారు. ఆదివాసీల కోటాలో మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ఊహాగానాలు కొనసాగాయి. చివరికి ఆయన ఢిల్లీ కూడా వెళ్లారు. ఆఖరి నిమిషం వరకూ వెయిట్ చేశారు. తాజాగా మోడీ కేబినెట్ విస్తరణలో ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఉమ్మడి జిల్లా బీజేపీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది.