పెట్రోల్ నీ బాబు ఇస్తాడా.. రైడ్ క్యాన్సిల్ చేసిన యువతిని చెంప ఛెళ్లుమనేలా కొట్టిన ఆటో డ్రైవర్(వీడియో)
సాధారణంగా ఇప్పుడు చాలా మంది అర్జెంట్ పని మీద బయటకు వెళ్లాలంటే క్యాబ్, ఆటో, బైక్ బుక్ చేసుకొని వెళ్తుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఇప్పుడు చాలా మంది అర్జెంట్ పని మీద బయటకు వెళ్లాలంటే క్యాబ్, ఆటో, బైక్ బుక్ చేసుకొని వెళ్తుంటారు. కానీ, కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ లేదా ఇతర కారణాల వల్ల మనం బుక్ చేసుకున్న ఆటోను క్యాన్సిల్ చేసి మరో ఆటో బుక్ చేసుకొని వెళ్లి పోవచ్చు. అలాగే కొన్ని సార్లు డ్రైవర్లు కూడా మనం బుక్ చేసిన ఆటోను క్యాన్సిల్ చేస్తుండటం జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ఓ యువతి కూడా ఆటో బుక్ చేసుకుంది. మరి ఆటో రావడానికి లేట్ అయ్యిందో ఏమో కాబోలు ఆమె ఆ రైడ్‌ను క్యాన్సల్ చేసింది. ఇక అంతే ఆ డ్రైవర్ వచ్చి ఆ అమ్మాయిని ఇష్టమొచ్చినట్టు తిడుతూ చివరికి కొట్టే వరకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..
బెంగళూరు సిటీలో(Bengalere City) ఓ యువతి ఓలా(OLA) యాప్‌లో ఆటో బుక్ చేసుకుంది. నాలుగు కిలో మీటర్ల(4KM) దూరంలో ఉన్న ఆటో స్పాట్‌కు చేరుకోవడానికి 15నిమిషాలు పట్టింది. తీరా ఆటో డ్రైవర్ బుకింగ్ పాయింట్ దగ్గరకు రాగానే ఆ యువతి రైడ్ క్యాన్సిల్ చేసింది. దీంతో ఆటో డ్రైవర్‌కు తీవ్ర కోపం వచ్చింది. అప్పుడు నేరుగా ఆమె వద్దకు వెళ్లి.. రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేశావు.. పెట్రోల్ ఊరికే వస్తుందా.. నీ బాబు ఇస్తాడా పెట్రోల్ అంటూ కోపంగా ఊగిపోయాడు. ఆ యువతి కూడా మీరు కూడా మేము బుక్ చేసినప్పుడు క్యాన్సిల్ చేస్తారుగా అని అడుగగా.. అప్పుడు ఆటోవాలా నీ రైడ్ అయితే చేయలేదుగా, పదా పోలీస్ స్టేషన్‌కు అంటూ ఈ యువతి పై చేయిచేసుకున్నాడు. అలా వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి పోయి ఆ డ్రైవర్ ఆ యువతి చెంప ఛెళ్లుమనిపించాడు. అయితే రోడ్డుపై జరుగుతున్న ఈ తతంగాన్ని చూస్తున్న మిగతా ఆటో డ్రైవర్లు, స్థానికులు జోక్యం చేసుకొని ఆటో డ్రైవర్‌ను కూల్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ ఆటోడ్రైవర్‌ను ఏకిపారేస్తున్నారు.
Yesterday I faced severe harassment and was physically assaulted by your auto driver in Bangalore after a simple ride cancellation. Despite reporting, your customer support has been unresponsive. Immediate action is needed! @Olacabs @ola_supports @BlrCityPolice pic.twitter.com/iTkXFKDMS7
— Niti (@nihihiti) September 4, 2024
(video link credits to Niti X account)