video viral:‘కారు ఆపమని అడిగిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌’.. ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్!

సోషల్ మీడియా(Social media)లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

Update: 2024-10-25 11:26 GMT

దిశ,వెబ్‌డెస్క్: సోషల్ మీడియా(Social media)లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హల్‌చల్ సృష్టిస్తోంది. కర్ణాటక(Karnataka)లోని శివమొగ్గలో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘటనలో కారు డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును కారు డ్రైవర్(Car driver) ఆ కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు. అసలు విషయంలోకి వెళితే.. ఎస్‌యూవీ కారు నడుపుతున్న ఓ వ్యక్తి అతివేగంగా డ్రైవింగ్(Driving too fast)చేస్తున్నందుకు ట్రాఫిక్ పోలీస్ ఆప‌మ‌ని అడిగాడు. ట్రాఫిక్ పోలీస్ ఆ డ్రైవర్‌ని ఆపమని కోరుతున్న వినకుండా.. ఆ పోలీస్ అధికారినే ఢీకొట్టి కారు బానెట్‌పై పడేశాడు.

ఈ ఘటన సహ్యాద్రి కళాశాల సమీపంలో సాధారణ వాహన తనిఖీ చేస్తుండగా చోటుచేసుకుంది. వ్యక్తి కారు బానెట్ పైన ట్రాఫిక్ అధికారితో 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఇలా అమానుషంగా ప్ర‌వ‌ర్తించిన వ్య‌క్తిని భద్రావతిలో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మిథున్ జగదలేగా పోలీసులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు శివమొగ్గ పోలీసు సూపరింటెండెంట్(Sivamogga Superintendent of Police) వెల్ల‌డించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Tags:    

Similar News