Interesting incident:విచిత్ర ఘటన.. తల నరికినా రెండేళ్లు బతికిన కోడి!

ఇటీవల కాలంలో చిత్రవిచిత్రమైన ఘటనలు సోషల్ మీడియా(Social media) వేదికగా చూస్తున్నాం.

Update: 2024-10-25 12:31 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో చిత్రవిచిత్రమైన ఘటనలు సోషల్ మీడియా(Social media) వేదికగా చూస్తున్నాం. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వింతలు, విశేషాలు, షాకింగ్ ఘటన(Shocking incident)లకు కొదువే లేకుండా పోయింది. ఎక్కడ ఏం జరిగినా సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తునే ఉన్నాం. అలాగే జంతువులు(Animals) , పక్షుల(birds)కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విచిత్రమైన ఘటన కొలరాడోలోని(US) ఫ్రూటాలో 1945లో జరిగింది. స్థానికంగా ఉండే రైతు లాయిడ్ ఓల్సన్(Lloyd Olson) తన దగ్గరున్న కోడి మెడను కట్ చేయగా అది పారిపోయింది. తర్వాత దాన్ని పట్టుకొచ్చి చూస్తే బతికే ఉంది. ఓ బాక్స్‌లో పెట్టి ఐడ్రాపర్‌(Eyedropper)ని ఉపయోగించి ఆహారం అందించారు. కోళ్లకు తల వెనుక భాగంలో మెదడు ఉంటుంది. ఆ పార్ట్ కట్ కాకపోవడంతో కోడి బతికిపోయింది. అయితే రెండేళ్ల తర్వాత 1947లో అది మరణించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News