Balli : తినే ఆహారంలో బల్లి పడితే అది విషంగా మారుతుందా..?.. షాకింగ్ నిజాలు చెప్పిన నిపుణులు
మనలో చాలా మంది బల్లిని ( Lizard ) చూస్తేనే ఎగిరి గంతేస్తారు.
దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది బల్లిని ( Lizard ) చూస్తేనే ఎగిరి గంతేస్తారు. ఇక శరీరంపై పడితే రెండు, మూడు రోజుల వరకు భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే, ఇవి చూడటానికి భిన్నంగా ఉంటాయి. గోడ మీద అలాగే రోజుల తరబడి కూడా ఉంటాయి. అయితే, మనం ప్రిపేర్ చేసుకునే ఆహారాల్లో ఒక్కోసారి బల్లి పడడం జరుగుతుంది. దాన్ని, మనం గమనించి చూస్తే వెంటనే అప్రమత్తం అవుతాము. అయితే, ఆహారంలో బల్లి పడితే అది నిజంగానే విషమవుతుందా? దీని పై పరిశోధనలు చేసిన నిపుణులు షాకింగ్ నిజాలు వెల్లడించారు.
మన ఇళ్లలో కనిపించే బల్లులు చాలా వరకు విషపూరితమైనవి ( Dangerous ) కావు. అలాంటి వాటిలో విషం కూడా ఉండదు. వాటి వల్ల మనకీ ఎలాంటి హాని జరగదు. కాకపోతే వాటికీ బాక్టీరియా, వైరస్‌లు అంటి పెట్టుకుని ఉంటాయి. ఈ క్రమంలో బల్లులు వండుకునే ఆహారంలో పడితే అది విషమవుతుందని నిపుణులు వెల్లడించారు.
బల్లులను అంటి పెట్టుకున్న ప్రమాదకరమైన బ్యాక్టీరియాను బట్టి ఆహారం విషంగా మారుతుంది. కొన్నింటికి సూక్ష్మ జీవులు ఉండకపోవచ్చు. కానీ, వాటి చర్మం పై సూక్ష్మ జీవులు ఉంటే అది విషపూరితమవుతుంది. అలాంటి ఆహారాన్ని తీసుకుంటే వెంటనే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. దీంతో వాంతులు, విరేచనాలు వస్తాయి. కొందరికైతే, ప్రాణాపాయ పరిస్థితులు కూడా తలెత్తుతాయి. దాని వలన బల్లి పడిన ఆహార పదార్ధాలను అస్సలు తీసుకోకూడదు. బల్లులు హానికరమైనవి కాకపోయినా.. బల్లి పడిన ఆహారాన్ని తినకూడదు.. వెంటనే పడేయాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.