Coffee: గుండెపోటు టెన్షన్ వద్దు.. కాఫీ ఈ టైంలో తాగితే ఏ సమస్యా ఉండదు!
Coffee: మనలో చాలా మందికి కాఫీ( Coffee) తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీ మన గుండె ఆరోగ్యాని(Heart health)కి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి ఇప్పటి వరకు ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ముఖ్యంగా ప్రతిరోజు ఒకే సమయంలో కాఫీ తాగితే గుండెపోటు ముప్పు కూడా తగ్గుతుందని ఇప్పుడు కొత్త అధ్యయనం(New study) చెబుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: మనలో చాలామందికి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. ప్రపంచంలో అధిక శాతం మంది తాగుతున్న పానీయాలలో టీ, కాఫీలే ఎక్కువగా ఉంటాయి. టీ లవర్స్, కాఫీ లవర్స్ సంఖ్య పెరిగిపోతుంది. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిదా?కాదా?అనేది తెలుసుకునేందుకు ఎన్నో అధ్యయనాలు కూడా జరిగాయి. గుండె ఆరోగ్యాని(Heart health)కి కాఫీ ఎంతో మేలు చేస్తాయని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
అయితే కొంత మంది కాఫీ( Coffee)తోనే తమ రోజున ప్రారంభిస్తారు. మరి కొంతమంది మాత్రం టీ తాగుతారు. మరికొందరు రోజులో అనేక కప్పుల కాఫీ తాగుతుంటారు. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా ప్రయోజనాన్ని అందిస్తాయి. అయితే కాఫీలో ఉండే కెఫిన్ (Caffeine)వల్ల కాఫీని తక్కువ మొత్తంలో తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇటీవల ప్రచురించిన ఒక అధ్యాయనం కాఫీ తాగడానికి సరైన సమయం ఒకటి ఉంటుంది అని చెప్పింది. ఆ సమయానికి కాఫీ తాగడం వల్ల గుండె(Heart health)కు ఎంతో మేలు జరుగుతుందట.
కాఫీ ఏ సమయంలో తాగాలి?
ఇటీవల యూరోపియన్ హార్ట్ జర్నల్(European Heart Journal) లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో.. ఉదయం కాఫీ( Coffee) తాగడం చాలా ప్రయోజనాకరమని పేర్కొన్నారు. ఉదయం పూట కాఫీ తాగే వారిలో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు 31 శాతం తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యాయనంలో తేలింది. అదే సమయంలో అటువంటి వ్యక్తుల్లో ఇతర కారణాలవల్ల మరణించే ప్రమాదం కూడా 16% తగ్గిందని తేలింది. అయితే ఈ ప్రయోజనాలను ఉదయాన్నే కాఫీ తాగే వారిలో మాత్రమే కనిపిస్తాయట. అయితే మీరు రోజంతా వేరే సమయంలో కాఫీ తాగుతుంటే మీరు ఈ ప్రయోజనాలు పొందకపోవచ్చు. అయితే దీనిపై ఇంకా లోతుగా పరిశోధనలు(Research) జరగాల్సి ఉందని పేర్కొంది.
రోజులో ఇతర సమయంలో కాఫీ తాగడం కంటే.. ఉదయాన్నే కాఫీ తాగడం మంచిదని చాలామంది భావిస్తారు. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫీన్ మెదడును ఉత్తేజితం చేస్తుందని అధ్యయనం చెబుతోంది. రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచేందుకు మంచి ప్రారంభాన్ని ఇస్తుంది. రోజు ఆలస్యంగా కాఫీ తాగడం వల్ల శరీరంలో అంతర్గత గడియారం దెబ్బతింటుందట. ఇది హార్మోన్ల స్థాయి(Hormonal levels)ని కూడా ప్రభావితం చేస్తుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ లుక్వి చెప్పారు. అదే సమయంలో ఇది గుండె ఆరోగ్యంతో నేరుగా సంబంధం ఉన్న మంట, రక్తపోటు వంటి కారకాలపై కూడా ప్రభావం చూపుతుందట.
అయితే కాఫీని చిన్నపిల్లలకు తాగించడం మాత్రం మంచి పద్ధతి కాదని చెబుతున్నారు. చిన్నపిల్లలకు ప్రోటీన్, క్యాల్షియంతో నిండి ఉన్న పాలను తాగించడం మంచిది. పాలు కలిపిన కాఫీ మాత్రమే కాదు..బ్లాక్ కాఫీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధ్యయనాలు తెలిపాయి. అయితే అధికంగా కాఫీ తాగడం వల్ల శరీరంలో కెఫిన్ పేరుతో పోతుంది. కాబట్టి రోజుకు రెండు కప్పుల కాఫీ (Two cups of coffee)కంటే ఎక్కువగా తాగకపోవడమే అన్ని విధాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.