90 hours a week: 'భార్యను చూస్తూ ఎంతసేపు కూర్చుంటారు.. ఆదివారాలూ డ్యూటీ చేయండి'

ఉద్యోగుల పని గంటలపై ఎల్ అండ్ టీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-01-09 09:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగుల పని గంటలపై ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Infosys Narayana Murthy) చేసిన వ్యాఖ్యలపై చర్చ చల్లారకముందే తాజాగా ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ (L&T Chairman Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కంపెనీ ఇంటర్నల్ మీటింగ్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఉద్యోగులు ఎక్కువ పని పని గంటలు పని చేయాలని దిశానిర్దేశం చేస్తున్న క్రమంలో భార్య, భర్తల ప్రస్తావన తీసుకురావడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ' ఎంత కాలం మీరు ఇంట్లో మీ భార్యలను, భర్తలను చూస్తూ ఉండిపోతారు. వారానికి 90 గంటలు (90 Hours in a Week) పని చేయాలని అవసరమైతే ఆదివారాలు కూడా పని చేయాలి. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీస్ లు ఎక్కువ సమయం ఉంటామని మీ భార్యలకు చెప్పాలి. ఆదివారాలు మీతో పని చేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. నేను ఆదివారాలు పని చేస్తున్నాను. ఒక వేళ మీతో ఆదివారాల పని చేయించగలిగితే నాకు అదే సంతోషం' అంటూ సంస్థ ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు నెటిజన్లు భిన్నరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొంత మంది నెటిజన్లు జీవిత భాగస్వాముల ప్రస్తావన తీసుకురావడం ఏంటని సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

పెరిగిపోయిన పని ఒత్తిడిల కారణంగా ఇటు ఉద్యోగం అటు కుటుంబాలను బ్యాలెన్స్ (Work Balance) చేసుకోలేక సతమతం అవుతున్న ఉద్యోగులపై మరింత ఒత్తిడి తీసుకురావడమే సరికాదనుకుంటే అందులో వ్యక్తిగత విషయాల్లోకి చొరబడి మాట్లాడటం సరికాదని మండిపడుతున్నారు. కాగా వారానికి 90 గంటల వర్క్ కల్చర్ పై ఇటీవల దేశంలోని ప్రముఖులు స్పందిస్తున్నారు. ఎక్కువ గంటలు పని చేయమని చెప్పడం అర్థరహితం అని, ముందు సమర్థతపై దృష్టి సారించాలని కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం విమర్శలు చేశారు. ఇక వర్క్ బ్యాలెన్స్ పై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అదానీ గ్రూప్ సంస్థల యజమాని గౌతర్ అదానీ స్పందిస్తూ.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో మీరు అనుసరిస్తున్న విధానాలను ఇతరులపైకి రుద్దొద్దు. పనిలోనే నిమగ్నమైపోతే భార్య పారిపోతుంది అంటూ చమత్కరించారు. కుటుంబం, ఉద్యోగం ఇవే మనకు ప్రపంచం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News