Viral: బెంగుళూరులో న‌ర్సరీ ఫీజు 1.5 ల‌క్షలు.. ప్రాక్టీస్ మానేస్తా అంటున్న డాక్టర్

బెంగుళూరులో న‌ర్సరీకి ఫీజు రూ.1.5 ల‌క్షలు అని ఓ వ్యక్తి పోస్ట్ చేసిన ఫీ స్ట్రక్చర్ ఫోటో సోషల్‌ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Update: 2024-10-24 10:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగుళూరులో న‌ర్సరీకి ఫీజు రూ.1.5 ల‌క్షలు అని ఓ వ్యక్తి పోస్ట్ చేసిన ఫీ స్ట్రక్చర్ ఫోటో సోషల్‌ మీడియాలో వైర‌ల్ గా మారింది. సాదారణంగా పిల్లల ఫీజులు తలకు మించిన భారంగా మారుతున్నాయని ప్రతీ పిల్లాడి తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే బెంగుళూరులో కిండర్ గార్డెన్ అనే ప్రైవేట్ స్కూల్ జూనియర్ కేజీ పిల్లలకు వసూలు చేసే ఫీ స్ట్రక్చర్ చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. నర్సరీ పిల్లలకు ఏకంగా 1.5 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇందులో అడ్మిషన్ కు 55 వేలు అయితే.. ఇతరత్రా ఖర్చులకు దాదాపు లక్ష రూపాయల డబ్బు వసూలు చేస్తున్నారు. దీనిని బెంగళూరుకు చెందిన ఈఎన్టీ డాక్టర్ జగదీష్ చతుర్వేది సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై ఆయన.. పేరెంట్ ఓరియంటేషన్ ఫీజు 8,400 గా ఉందని, వైద్యుని సంప్రదింపుల కోసం ఇందులో 20 శాతం పెట్టడానికి కూడా తల్లిదండ్రులు అంగీకరించరని అన్నారు. అంతేగాక తాను కూడా ప్రాక్టీస్ మానేసి స్కూల్ ప్రారంభిస్తానని హస్యాస్పదంగా స్పందించారు. ప్రస్తుతం ఈ ఫీ స్ట్రక్చర్ కు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

 


Similar News