బెడ్‌రూమ్‌లో పాముల సయ్యాట..భయాందోళనలో కుటుంబం

Update: 2024-10-23 06:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : అడవుల్లోనూ..పొలాలు..పొదల్లోనూ సరస సయ్యాటలు ఆడాల్సిన పాముల జంట అదంతా రోటిన్ అనుకున్నాయో ఏమో మరి. ఓ ఇంట్లోని పడక గదిలో దూరి మంచం కింద చేరిపోయి తమ సరస సల్లాపాలు, సయ్యాటలు సాగించాయి. రాత్రి పూట తమ ఇంటి పడక గదిలో దూరిన విష పాముల సయ్యాటను గమనించిన కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగు తీశారు. పాముల సమాచారాన్ని స్నేక్ క్యాచర్ కు అందించారు. పడక గదిలో దూరి పాములు సాగిస్తున్న సయ్యాటల వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ ఎక్స్ లో పోస్టు చేయగా, అది వైరల్ గా మారింది. పాముల సమాచారాన్ని అందుకున్న స్నేక్ క్యాచర్‌ ఆ ఇంటికి చేరుకుని చాకచక్యంగా వాటిని పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని పర్వీన్ కస్వాన్ తన పోస్టులో వెల్లడించారు.

“మా సిబ్బందిలో ఒకరికి ఒక గ్రామం నుండి అర్థరాత్రి ఇంట్లోకి పాములు వచ్చాయన్న ఫోన్ కాల్ వచ్చిందని, సిబ్బంది వెళ్ళీ చూడగా అత్యంత విషపూరితమైన 'వాల్స్ క్రైట్' రకం పాములు రెండు బెడ్‌రూమ్‌లో సయ్యాటలాడుతున్నాయని తెలిపారు. వాల్స్ క్రైట్, లేదా బంగారస్ వాలీ రకం పాములకు బ్రిటీష్ హెర్పెటాలజిస్ట్ ఫ్రాంక్ వాల్ నామకరణం చేశారని, అవి ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌లో కనిపించే అత్యంత విషపూరితమైన పాము జాతులలో ఒకటని వెల్లడించారు. మా సిబ్బంది ఆ పాములను పట్టుకుని అడవిలో వదిలేయడం జరిగిందని ఆయన తెలిపారు. కాగా పాముల సయ్యాటల వీడియోను 62,000వేల మంది వీక్షించడం విశేషం. 

https://x.com/ParveenKaswan/status/1848567330097246642


Similar News