Pune: భారత్‌లో అక్రమ నివాసం.. మహారాష్ట్రలో 21 మంది బంగ్లాదేశ్ పౌరుల అరెస్ట్

భారత్‌లో అక్రమంగా నివసిస్తున్నారనే ఆరోపణలతో 21 మంది బంగ్లాదేశ్ పౌరులను మహారాష్ట్ర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

Update: 2024-10-23 08:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో అక్రమంగా నివసిస్తున్నారనే ఆరోపణలతో 21 మంది బంగ్లాదేశ్ పౌరులను మహారాష్ట్ర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరిలో 15 మంది పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. కొంతమంది బంగ్లాదేశ్ పౌరులు నకిలీ పత్రాలతో రంజన్‌గావ్ ప్రాంతంలో ఉంటున్నారని సమాచారం అందింది. దీంతో పూణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ ఆధ్వర్యంలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్), రంజన్‌గావ్ ఎంఐడీసీ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే 21 మంది నిందితులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించి సాధారణ కూలీలుగా పనిచేస్తున్నారని ఎస్పీ దేశ్‌ముఖ్ తెలిపారు. సుమారు ఏడాది కాలంగా ఇక్కడే ఉంటున్నట్టు వెల్లడించారు. వీరందరిపై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం కస్టడీకి తరలించినట్టు చెప్పారు.


Similar News