Big Alert:పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఎప్పుడంటే?

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని ఇటీవల ప్రారంభించారు. PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది.

Update: 2024-10-23 07:57 GMT

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని ఇటీవల ప్రారంభించారు. PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఈ నెల 12 తేదీ నుంచి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమైన మొదటి రోజే 1.55 లక్షల మంది అభ్యర్థులు 24 గంటల్లో తమను తాము నమోదు చేసుకున్నారు. ఇంటర్న్‌షిప్‌లకు 12 నెలల పాటు నెలవారీ రూ.5,000 ఆర్థిక సహాయంతో పాటు రూ.6,000 వన్-టైమ్ గ్రాంట్ ఇవ్వబడుతుంది. TCS, ONGC, Mahindra & Mahindra వంటి టాప్ కంపెనీలు అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్‌ను అందిస్తాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక పోర్టల్ pminternship.mca.gov.inలో నమోదు చేసుకోవచ్చు.

2024 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ప్రకటించారు. భారతదేశంలోని టాప్ 500 కంపెనీలలో 12 నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేయడానికి విద్యార్థులకు అవకాశం కల్పించడం దీని లక్ష్యం. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 25, 2024గా ప్రకటించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ అర్హత, ముఖ్యమైన తేదీలు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు దశలు, ఇతర వివరాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఇంటర్న్ షిప్ స్కీమ్ కు మరో రెండు రోజులే గడువు ఉండడంతో అభ్యర్థులు తొందరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యువతకు సాధికారత కల్పించే ప్రయత్నంలో భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

అర్హతలు:

విద్యార్హత:10వ తరగతి లేదా 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ITI గ్రాడ్యుయేట్లు, పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారు కూడా అర్హులు. అలాగే BA, BCom, BPharm వంటి డిగ్రీలు చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు

వయోపరిమితి: అభ్యర్థులు కనీసం 21 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ముఖ్యమైన తేదీలు..

*అక్టోబర్ 12 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

* అక్టోబర్ 25 దరఖాస్తు చివరి తేదీ.

*నవంబర్ 7 వరకు కంపెనీలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

*నవంబర్ 15 ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్‌లు అందజేయబడతాయి.

*డిసెంబర్ 2 మొదటి బ్యాచ్ ఇంటర్న్‌షిప్ ప్రారంభమవుతుంది.

Tags:    

Similar News