వామ్మో.. పక్షిలా గాలిలో ఎగురుతూ బుసలు కొడుతున్న పాము.. చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..!(వీడియో)
సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు చాలా వైరల్ అవుతూ ఉంటాయి.
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు చాలా వైరల్ అవుతూ ఉంటాయి. అవి చూసినప్పుడల్లా మనకు భయం కలుగుతుంది. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం వెన్నులో వణుకు పుడుతుంది. ప్రస్తుతం ఈ వీడియోలో కనిపిస్తున్న పాము చాలా ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే బేసిక్‌గా పాములు పాకుతాయన్న సంగతి తెలిసిందే. కానీ, ఆ స్నేక్ మాత్రం ఏకంగా గాల్లో పక్షి ఎగిరినట్టు ఎగురుకుంటూ వచ్చి నేలపై పడి పాక్కుంటూ వెళ్లి పోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ పాము ఇంటి కప్పు అంచున ఉంది. కాసేపటి తర్వాత పాము టెర్రస్ చివరికి చేరుకుని అక్కడి నుంచి అమాంతం కిందకు దూకింది. అలా ఎగురుకుంటూ వచ్చి నేలపై పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరు లేరు. ఒకవేళ అక్కడ ఎవరైనా ఉంటే మాత్రం వారి పని అయిపోతుండే. ఈ అరుదైన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయగానే క్షణాల్లో అది వైరల్ అయిపోయింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Incredible video showing a Snake launching itself from a roof. 🐍😳 pic.twitter.com/cR1woYXTlh
— H0W_THlNGS_W0RK (@HowThingsWork_) January 27, 2023
(video link credits to H0W_THlNGS_W0R 'X' account)