Viral: ఆ పని వద్దన్నందుకు భర్త పై కేసు పెట్టిన భార్య.. అసలు కారణం తెలిసి ఖంగుతిన్న జడ్జి

ప్రస్తుత కాలంలో చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు రావడంతో చాలా మంది విడాకుల వైపుగా అడుగులేస్తున్నారు.

Update: 2024-08-24 08:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు రావడంతో చాలా మంది విడాకుల వైపుగా అడుగులేస్తున్నారు. ఇక అప్పట్లో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడి సద్దుబాటు అయితే కలిసి ఉండేవారు లేదంటే మాటల్లోనే విడిపోయి.. వేర్వేరు ఉండేవారు. కానీ, మారుతున్న కాలానుగుణంగా చట్టాలకు, న్యాయ వ్యవస్థకు కట్టుబడి ఉండాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు డివోర్స్ కావాలంటే కచ్చితంగా కోర్టులో విడాకులకు అప్పీల్ చేసుకోవాల్సిందే. అయితే ప్రస్తుతం సిల్లీ సిల్లీ రీజన్స్‌కే విడాకులు తీసుకుంటున్నారు. వాటి రీజన్స్ తెలిసి జడ్జీలు నోరెళ్లబెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఆ కోవకు చెందిన న్యూస్ ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే..

తాజాగా బెంగళూరుకు చెందిన ఓ మహిళ.. తన భర్త తనను వేధిస్తున్నాడంటూ గృహ హింస చట్టం కింద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు సమయంలో ఆమె ఇచ్చిన ఫిర్యాదు తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. అంత షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే.. తన భర్త ఫ్రెంచ్ ఫ్రైస్ తిననీయడం లేదు అని అతనిపై కేసు పెట్టింది. ఏంటి నిజమా అంటే అవుననే చెప్పాలి. తన భర్త కాన్పు అనంతరం పౌష్టికాహారం, పండ్లు, పాలు వంటివి కాకుండా బంగాళదుంపతో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ తినవద్దని అన్నందుకు తన భార్య తన పైనే కేసు పెట్టిందని ఆ వ్యక్తి మొరపెట్టుకున్నాడు. దీంతో ఆమె వాదన సరికాదని తనపై నమోదైన కేసును రద్దు చేయాలంటూ ఆమె భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై స్పందించిన జస్టిస్ ఎం. నాగ ప్రసన్న ఆశ్చర్యపోయారు. భార్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని తినొద్దు అని వారిస్తే ఎదురు కేసు పెట్టడం సరికాదని కేసు పెట్టడం సరికాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో అన్ని చోట్లా అతనిపై నమోదైన కేసులపై స్టే విధించారు.


Similar News