Asteroid:భూమి వైపు దూసుకొస్తున్న.. 70 అంతస్తుల భవనమంత పరిమాణం ఉన్న భారీ గ్రహశకలం

అంతరిక్షం(space)లో ఎన్నో గ్రహశకలాలు(Asteroids) సంచరిస్తూ ఉంటాయనే సంగతి తెలిసిందే.

Update: 2024-10-26 14:01 GMT

దిశ,వెబ్‌డెస్క్: అంతరిక్షం(space)లో ఎన్నో గ్రహశకలాలు(Asteroids) సంచరిస్తూ ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే అవి తమదైన ఒక గమ్య స్థానం(Destination)లో పరిమిత వేగంతో ప్రయాణం చేస్తుంటాయి. కానీ.. వీటికి భిన్నంగా ఒక భారీ గ్రహశకలం(A giant asteroid) భూమి వైపు దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు(NASA scientists) వెల్లడించారు. ఈ నెల 28వ తేదీన ఓ భారీ గ్రహశకలం భూమి సమీపానికి రానున్నట్లు నాసా సైంటిస్టులు తెలిపారు. దీనికి ‘ఆస్టరాయిడ్ 2020 WG’(Asteroid 2020 WG) అనే పేరు పెట్టారు. ఈ గ్రహశకలం 70 అంతస్తుల భవనమంత పరిమాణం ఉంటుందని తెలిపారు.

ఈ గ్రహశకలం(Asteroid) భూమికి 3.3 మిలియన్ కి.మీ దూరంలోకి రాబోతున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. ఇది సెకన్‌కు 9.43 కి.మీ వేగంతో భూమి వైపుగా దూసుకొస్తోందని తెలిపారు. దీన్ని సమీపం నుంచే క్షణ్ణంగా పరిశీలించవచ్చని అంటున్నారు. ఇది అరుదైన అవకాశమని చెబుతున్నారు. భవిష్యత్తు(the future)లో భూమికి సమీపంలోకి రాబోయే గ్రహశకలాలు వాటినుంచి వాటిల్లే ముప్పు తప్పించే మార్గాలపై అధ్యయనానికి ‘Asteroid 2020 WG’ రాకను ఉపయోగించుకుంటామని వెల్లడించారు. ఈ ఆస్టరాయిడ్(Asteroids) వల్ల భూమికి ఎలాంటి ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు(scientists) పేర్కొన్నారు.

Tags:    

Similar News