Viral: వీడ్కోలు పార్టీలో డాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిన కానిస్టేబుల్..

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి.

Update: 2024-08-30 02:30 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. నవ్వుతూ కుప్పకూలిపోవడం, తింటూ హార్ట్ ఎటాక్ రావడం, డాన్స్ చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురికావడం వంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఆ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

దిల్లీ రూప్ నగర్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవి కుమార్.. స్టేషన్ హౌస్ అధికారి (SHO) బదిలీ కావడంతో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ రవికుమార్ పలు సాంగ్స్‌కు డాన్స్ కూడా చేశాడు. అలా డాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడ ఉన్నవారందరు అతన్ని హుటా హుటిగా హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లారు. అయితే అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే రవికుమార్ మరణించినట్లు ప్రకటించారు. దీంతో అప్పటి వరకు తమతో సరదాగా ఉన్న కానిస్టేబుల్ చనిపోయాడని తెలిసి అతని సహచరులు షాక్‌కు గురి అయ్యారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక 45 రోజుల క్రితమే రవి కుమార్ హార్ట్‌కు సంబంధించిన టెస్ట్‌లు చేయించుకోవడం గమనార్హం.

ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్ డాన్స్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అది చూసిన నెటిజన్లు.. కొంతమంది షాక్ అవుతుంటే మరికొందరు.. లైఫ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Similar News