Viral: ఇలా తయారయ్యారేంట్రా బాబు.. పుష్ప- శ్రీవల్లి వినాయకుడు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

సెప్టెంబర్ 7 న భారత దేశమంతటా వినాయక చవితిని సెలబ్రేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

Update: 2024-09-04 07:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ 7 న భారత దేశమంతటా వినాయక చవితిని సెలబ్రేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే గణేష్ మండపాలను ఏర్పాటు చేశారు. విగ్రహాలను కొలువు దీర్చేందుకు ఉత్సవ కమిటీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అయితే ప్రతి సంవత్సరం వినాయకుడి విగ్రహాలు చూడటానికి చక్కగా ఎంతో వినూత్నంగా ఉంటాయి. వాటిని చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు అని అనడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. అలాంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వినాయక విగ్రహం వైరల్ అవుతుంది. అది చూసిన కొంత మంది షాక్‌కు గురైతున్నారు.

ప్రస్తుత కాలంలో చాలా మంది ట్రెండింగ్‌కు బాగా అలవాటు పడిపోయారు. అందులో భాగంగా కొందరు పుష్ప 2 సినిమాలో శ్రీవల్లీ పుష్ప థీమ్‌ను సరితూగేలా ఓ వినాయక రూపాన్ని రూపొందించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సేమ్ టు సేమ్ పుష్ప 2 మూవీ లోని అల్లు అర్జున్, రష్మిక తరహాలో ఉన్న విగ్రహాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతూ.. హీరోలపై అభిమానం ఉండాలి కానీ, మరి ఇలా అభిమానం పేరుతో దేవుళ్లను పిచ్చి పిచ్చిగా చేయవద్దని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.



Similar News