Wedding invitation: వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. అతను ఎక్కడైనా కనిపిస్తే తరిమి కొట్టండి.. చూస్తే షాకవ్వాల్సిందే!
వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. అతను ఎక్కడైనా కనిపిస్తే తరిమి కొట్టండి..
దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం, మన దేశంలో జరిగే పెళ్ళి వేడుకలు చాలా కాస్టలీగా మారాయి. ఒక్క రోజు కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయిన కూడా కొన్ని బంధాలు మధ్యలోనే తెగిపోతున్నాయి. ఇదిలా ఉండగా పెళ్లి పనుల్లో ముఖ్యమైన పని పెళ్లి కార్డులు ( wedding invitation )
అన్నింటి కంటే ముందు శుభలేఖలను ప్రింట్ చేయించి నెలల ముందు నుంచే ఈ హడావుడి మొదలవుతుంది. అయితే, ఇప్పుడు పెళ్లి చేసుకునే యువత పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న పనిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇవి క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. తాజగా, ఒక పెళ్లి కార్డు కూడా అలాగే వైరల్ అవుతుంది. అసలు ఈ కార్డ్ వైరల్ కావడానికి గల కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామానికి చెందిన రోహిత్, రజనీల పెళ్ళికి సంబంధించిన కార్డు ఏప్రిల్ 15న ప్రింట్ అయింది. ఇది వైరల్ అవ్వడానికి కారణం.. అక్షరాలు కాదు.. వెడ్డింగ్ కార్డులో రాసిన ఒక లైన్ వల్ల నెట్టింట ట్రెండ్ అవుతుంది. వారి స్నేహితుల్లో ఒకరైన సౌరభ్ పెళ్లికి రావొద్దు.. అతను ఎక్కడైనా కనిపిస్తే తరిమి కొట్టండి.. అంటూ ఘాటుగా రాశారు. ఇది చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు.