ISRO:ఇస్రో మరో ప్రయోగం.. రేపు నింగిలోకి PSLV-C60 రాకెట్

ఇస్రో(ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. రేపు(డిసెంబర్ 30)సోమవారం ప్రయోగించనున్న PSLV-C60 రాకెట్‌కు మరికొద్ది గంటల్లో కౌంట్‌డౌన్‌ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Update: 2024-12-29 11:06 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఇస్రో(ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. రేపు(డిసెంబర్ 30)సోమవారం ప్రయోగించనున్న PSLV-C60 రాకెట్‌కు మరికొద్ది గంటల్లో కౌంట్‌డౌన్‌ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సూళ్లురుపేట షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రేపు రాత్రి 9.58 గంటలకు రాకెట్‌ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. అంతరిక్షంలో నిర్ధిష్ట ప్రదేశంలో 2 స్పేస్‌క్రాప్ట్‌లను కలపడం-స్పేస్ డాకింగ్ ప్రయోగాలకు ఉద్దేశించిన PSLV-C60ని ఇస్రో సోమవారం ప్రయోగించనుంది. SpaDex మిషన్‌లో SDX01(ఛేజర్), SDX02(టార్గెట్) ఉపగ్రహాలను నింగిలోకి పంపుతారు.

ఈ రాకెట్‌ ప్రయోగానికి ఇవాళ(ఆదివారం) రాత్రి 8.58 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభానికి ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ (Chairman Somanath) రాత్రి బెంగళూరు నుంచి షార్‌కు చేరుకోనున్నారు. PSLV సిరీస్‌లో ఇది 62వ ప్రయోగం, PSLV కోర్‌ అలోన్‌ దశతో చేసే 18వ ప్రయోగమిది. రేపు నింగికి ఎగరనున్న PSLV-C60 రాకెట్‌ 320 టన్నుల బరువు, 44.5 మీటర్ల ఎత్తు ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. స్ట్రాపాన్‌ బూస్టర్లను( Strapon boosters) ఉపయోగించకపోవడంతో ఈ రాకెట్‌ బరువు 229 టన్నులుగా ఉంటుందని వివరించారు. రాకెట్‌లో రెండో దశకు ద్రవ ఇంధనం, మూడో దశకు ఘన ఇంధనం, నాలుగో దశకు ద్రవ ఇంధనాన్ని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News