Smart Phones: కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నారా.. జనవరిలో లాంచ్ కాబోతున్న మొబైల్స్ ఇవే..!

కొత్త సంవత్సరంలో స్మార్ట్ ఫోన్(Smart Phone) కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.

Update: 2024-12-30 17:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొత్త సంవత్సరంలో స్మార్ట్ ఫోన్(Smart Phone) కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. వచ్చే ఏడాది చాలా ఫోన్లు మార్కెట్లో(Market) లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే జనవరిలో విడుదల కానున్న వాటిలో రెడ్ మీ(Redmi), వన్ ప్లస్(One Plus), ఐటెల్(Itel) వంటి బ్రాండు కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ల వివరాలు తెలుసుకుందాం..

రెడ్ మీ 14 సీ 5G

చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి(Xiaomi) సబ్ బ్రాండ్ రెడ్‌మీ(Redmi) జనవరి 6న రెడ్‌మీ 14సీ 5జీ(Redmi 14C 5G) ఫోన్ లాంచ్ చేయనుంది. భారత్(India) తోపాటు సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో దీన్నీ విడుదల చేయనున్నారు. రెడ్‌మీ కంపెనీ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌(Amazon)లో ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది.

వన్ ప్లస్ 13 సిరీస్

ప్రముఖ టెక్ దిగ్గజం వన్ ప్లస్(One Plus) తన 13 సిరీస్ ఫోన్లను జనవరి 7న ఇండియాతో పాటు గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ సిరీస్ లో వన్ ప్లస్ 13, వన్ ప్లస్ 13ఆర్ మోడళ్లు ఉన్నాయి. వీటి ధర రూ. 67,000 నుంచి రూ. 70,000 మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ రెండు ఫోన్లలో ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

ఐటెల్ ఏ80

ఐటెల్ ఏ80 స్మార్ట్ ఫోన్ కూడా జనవరిలో లాంచ్ కానుంది. కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో ఈ విషయాన్ని తెలిపింది. ఈ ఫోన్ ధర రూ. 8,000గా ఉండనుంది. ఐపీ54 రేటింగ్ తో ఈ ఫోన్ రాబోతుంది. 50 మెగా పిక్సెల్ మెయిన్ రియర్ కెమెరాను కలిగి ఉంది.

Tags:    

Similar News