PLI Scheme: ఎంఅండ్ఎం, టాటా మోటార్స్‌కు రూ. 246 కోట్ల విలువైన పీఎల్ఐ ప్రోత్సాహకాలు
పీఎల్ఐ పథకాన్ని ఉపయోగించి స్థానిక తయారీ పెరగడంపై కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఆటోమొబైల్, ఆటో విడిభాగాల పరిశ్రమ కోసం పీఎల్ఐ పథకం కింద మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ సమర్పించిన రూ. 246 కోట్ల ప్రోత్సాహక క్లెయిమ్‌లను భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆమోదించిందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పీఎల్ఐ పథకాన్ని ఉపయోగించి స్థానికంగా తయారీ పెరగడంపై కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక తయారీ సామర్థ్యాన్ని వేగంగా అభివృద్ధి చేసినందుకు టాటా మోటార్స్, ఎంఅండ్ఎం కంపెనీలను అభినందించారు. ఇప్పటికీ పీఎల్ఐ పథకం కింద దరఖాస్తు చేసుకున్న కంపెనీలు దీని ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మూలాల ప్రకారం, టాటా మోటార్స్ సంస్థ 2023-24లో నమోదైన అమ్మకాల ఆధారంగా సుమారు రూ. 142.13 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం నుంచి అందుకుంది. సమీక్షించిన ఏడాదిలో కంపెనీ రూ. 1,380 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ద్వారా ఈ మొత్తాన్ని క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంది. అలాగే, ఎంఅండ్ఎం కంపెనీ రూ. 104.08 కోట్ల ప్రోత్సాహకాలను క్లెయిమ్ చేసుకుంది.
Read Also..